
ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న అనూష కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
సాక్షి, నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న అనూష కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమంటూ ఆమె వద్ద లభించిన సూసైడ్‌నోట్ ద్వారా తెలుస్తోంది. అనూష స్వస్థలం సిద్దిపేట జిల్లా మండపల్లి అని కాలేజీ యాజమాన్యం తెలిపింది. విద్యార్థి ఆత్మహత్యకు మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.