
ఈనెల 6న సాక్షిలో ప్రచురితమైన కథనం
నిర్మల్: సేవకు కావలసింది మాటలు కాదని.. చేతలని నిరూపించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈనెల 6న ‘గడ్డాల నాడూ మా బిడ్డలే..’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌పేజీలో ప్రచురించిన ఫొటో కథనానికి ఆయన స్పందించారు. ఈనెల 5న తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ నిర్మల్‌లో ప్రత్యేక శిబిరం నిర్వహించింది.
లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు లక్ష్మి, గంగన్న దివ్యాంగులైన తమ కుమారులు శ్రీనివాస్ (22), గంగన్న (18)లను భుజాలపై ఒకరిని, చంకలో ఒకరిని ఎత్తుకుని శిబిరానికి వచ్చారు. యుక్తవ యసులో ఉన్న కొడుకులను మోసుకొస్తున్న తల్లిదం డ్రుల ఫొటోలను ‘సాక్షి’ ప్రచురించింది. దీనికి స్పందించిన ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎమ్మెల్యే రామకృ ష్ణారెడ్డి ఆ కుటుంబానికి రూ.50 వేలు అందించాలని ‘సాక్షి’ సిబ్బందికి పంపించారు. త్వరలోనే ఈ డబ్బులు గంగన్న కుటుంబానికి అందనున్నాయి.