physically disabled person
-
దివ్యాంగులు ఐపీఎస్‌కు అర్హులే..
న్యూఢిల్లీ: దివ్యాంగులు సైతం ఐపీఎస్, ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలి, లక్షద్వీప్ పోలీసు సర్వీసు(డీఏఎన్‌ఐపీఎస్), ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసు(ఐఆర్పీఎఫ్ఎస్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలియజేసింది. సివిల్ సర్వీసెస్‌లతో ఆయా సర్వీసులను ప్రాధాన్యతలుగా ఎంచుకోవడానికి అనుమతించింది. సంబంధిత దరఖాస్తు పత్రాలను ఏప్రిల్1లోగా యూపీఎస్సీకి సమర్పించాలని దివ్యాంగ అభ్యర్థులకు సూచించింది. ఐపీఎస్, డీఏఎన్‌ఐపీఎస్, ఐఆర్పీఎఫ్ఎస్ పోస్టుల నుంచి దివ్యాంగులను మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 18న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. చదవండి: (Ukraine Russia War: కీవ్‌లో కల్లోలం.. ఏ క్షణంలోనైనా) -
‘ఆ బిడ్డల’కు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అండ
నిర్మల్: సేవకు కావలసింది మాటలు కాదని.. చేతలని నిరూపించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈనెల 6న ‘గడ్డాల నాడూ మా బిడ్డలే..’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌పేజీలో ప్రచురించిన ఫొటో కథనానికి ఆయన స్పందించారు. ఈనెల 5న తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ నిర్మల్‌లో ప్రత్యేక శిబిరం నిర్వహించింది. లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు లక్ష్మి, గంగన్న దివ్యాంగులైన తమ కుమారులు శ్రీనివాస్ (22), గంగన్న (18)లను భుజాలపై ఒకరిని, చంకలో ఒకరిని ఎత్తుకుని శిబిరానికి వచ్చారు. యుక్తవ యసులో ఉన్న కొడుకులను మోసుకొస్తున్న తల్లిదం డ్రుల ఫొటోలను ‘సాక్షి’ ప్రచురించింది. దీనికి స్పందించిన ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎమ్మెల్యే రామకృ ష్ణారెడ్డి ఆ కుటుంబానికి రూ.50 వేలు అందించాలని ‘సాక్షి’ సిబ్బందికి పంపించారు. త్వరలోనే ఈ డబ్బులు గంగన్న కుటుంబానికి అందనున్నాయి. -
పిల్లలు పెద్దయ్యారు.. సఖ్యతగా మెలగడం కుదరదని చెప్పినా..
సాక్షి, నల్గొండ: దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన డిండి మండల పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల పరిధిలోని పడమటితండాకు చెందిన జర్పుల చీన్యా(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 25ఏళ్ల క్రితం విద్యుదాఘాతం చోటు చేసుకోవడంతో రెండు చేతులు కోల్పోయాడు. చీన్యాకు అదే తండాకు చెందిన మహిళతో వివాహం జరిగింది. వారికి కుమారుడు శివ జన్మించాడు. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా చీన్యా భార్య కుమారుడిని వదిలి ఇంటినుంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి చీన్యా కుమారుడితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కాగా, చీన్యా అదే తండాకు చెందిన రాత్లావత్ మహిళ (పండు)తో సఖ్యతగా మెలుగుతున్నాడు. ఈ విషయం పెద్ద మనుషుల వద్దకు వెళ్లినా తీరు మార్చుకోలేదు. 20ఏళ్లుగా సఖ్యతగానే ఉంటున్నారు. చదవండి: మరణించిన టీచర్ పేరుతో రూ.33 లక్షలు డ్రా... కొడుక్కి విషయం తెలియడంతో.. పిల్లలు పెద్దయ్యారని.. చీన్యా కుమారుడు శివకు 20 ఏళ్లుగా కాగా, పండు కుమారుడికి వివాహం జరిగింది. ఇకపై ఇద్దరం కలుసుకోవడం కుదరదని పండు ప్రియుడు చీన్యాకు చెప్పింది. అయినా చీన్యా వినకుండా ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తన కుమారుడు సురేష్‌కు తెలిపి పథకం రచించింది. అనుకున్న విధంగానే చీన్యా ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భర్త లేని సమయంలో పండు ఇంటికి వెళ్లాడు. అప్పటికే మాటు వేసి ఉన్న పండు, ఆమె కుమారుడు సురేష్ చీన్యాపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో చీన్యా అక్కడినుంచి పారిపోతుండగా పట్టుకుని ఇంటి వద్దకు లాకెళ్లి నరికి దారుణంగా మట్టుబెట్టారు. సమాచారం తెలుసుకున్న చీన్యా కుమారుడు శివ అతడి కుంటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకునే సరికి అతడు రక్తపు మడుగులో విగతజీవుడిగా పడి ఉన్నాడు. చదవండి: ఎక్కువరోజులు ఉండలేను.. హైదరాబాద్ వచ్చేస్తా.. సీన్ కట్ చేస్తే.. సర్పంచ్‌కు ఫోన్ చేసి.. చీన్యాను హత్య చేసిన విషయాన్ని పండు స్థానిక సర్పంచ్ పాండుకు ఫోన్ చేసి చెప్పింది. పిల్లలు పెద్దయ్యారని సఖ్యతగా మెలగడం కుదరదని, గతంలో చేసినా పొరపాటు మళ్లీ చేయవద్దని కోరినా ఒత్తిడి చేయడంతో మట్టుబెట్టగా తప్పలేదని వివరించింది. వెంటనే సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని సీఐ బీసన్న, డిండి ఎస్ఐ సురేష్, చందంపేట ఎస్ఐ యాదయ్య పరిశీలించారు. చీన్యాను తానే గొడ్డలితో నరికి చంపానని పండు పోలీసుల వద్ద లొంగిపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కుమారుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ.సురేష్ తెలిపారు. -
కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్
సాక్షి, బంజారాహిల్స్: ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అని ప్రభాస్ ఓ సినిమాలో అంటే అందరూ చూశారు.. కానీ మూడు అడుగులు ఉన్న శివలాల్ కూడా ఇదే డైలాగ్ కొడితే అందరూ ఫక్కున నవ్వేశారు.. కానీ ఇప్పుడు శివలాల్‌ను చూసిన ప్రతిఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు.. నువ్వు పొట్టోడివి.. నీకు కారు నడపడం చేతనవుతుందా.. నువ్వు తినడానికి తప్పితే ఎందుకూ పనికిరావంటూ బంధుమిత్రులు, సన్నిహితులు, చుట్టుపక్కల వారు చేసిన హేళన మరుగుజ్జు గట్టిపల్లి శివలాల్ (38)పై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆరు అడుగుల పొడవుంటేనే కారు నడపవచ్చా..? మూడడుగులు ఉంటే నడపరాదా అనే ప్రశ్నను తనుకు తానే వేసుకొని నూతన సంవత్సరంలో ఓ గట్టి ఛాలెంజ్‌ను తనకు తానే తీసుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ఉదయ్ నగర్లో నివసించే జి.శివలాల్ పుట్టుకతోనే మరుగుజ్జు. మూడు అడుగుల పొడవు. అయితేనేం ఆత్మవిశ్వాసంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 400 మంది మరుగుజ్జుల్లో డిగ్రీ చేసిన మొదటి వికలాంగుడు. అంతేకాదు టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్‌లో డివిజన్ ఫస్ట్ వచ్చాడు. కంప్యూటర్లో పీజీ డీసీఏ చేయడమే కాదు బీకాం కూడా చదివాడు. ప్రస్తుతం ఓ చిన్న జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న శివలాల్‌కు కారు నేర్చుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. తానెందుకు కారు నడపకూడదని అనుకోవడమే కాకుండా తన స్నేహితుడి కారు తీసుకొని దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని కారు నేర్చుకున్నాడు. తనకు తానే దిక్సూచిగా మార్చుకున్నాడు. ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం అడ్డురాదని నిరూపించాడు. ప్రస్తుతం 90 శాతం డ్రైవింగ్ నేర్చుకోవడం పూర్తయిందని ఈ వారంలో డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంటున్నానని వెల్లడించాడు. డ్రైవర్‌గా ఉండటానికి తాను డ్రైవింగ్ నేర్చుకోవడం లేదని భార్య, పిల్లలతో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే మాత్రమే కారు నడుపుతానని శివలాల్ అంటున్నాడు. -
శ్రీవారి దర్శనం: వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక టోకెన్లు
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం 65 ఏళ్లకుపైబడిన వృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ నాలుగు వేల టోకెన్లను జారీ చేసింది. శ్రీవారి దర్శనం కోసం మంగళవారం ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెట్లు, మధ్యాహ్నం 2 గంటలకు రెండువేల టోకెన్లు, మూడు గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు ఇవ్వనుంది. రద్దీరోజుల్లో తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా.. ఈ అవకాశాన్ని కల్పించినట్టు టీటీడీ తెలిపింది. బుధవారం ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని, ఇందుకోసం నాలుగు వేల టోకెన్లు ఇస్తామని టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ప్రిన్స్‌పాల్ సెక్రటరీ శైలేంద్ర జోషి, ట్యాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, కర్నాటక డీజీపీ నీలమణిరాజు, తమిళనాడు డీజీపీ రాజేంద్రన్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. -
'వీల్ చైర్లో ఉన్న నేరస్తుడిని ఎలా ఉరి తీయాలి'
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తొలిసారి ఓ ఉరిశిక్షను అమలు చేయకుండా వాయిదా వేసింది. ముందుగా నిర్ణయించిన సమయంలో ఉరి తీసే కార్యక్రమాన్ని నిలిపివేయడం ఆ దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం కూడా గమనార్హం. ఓ హత్య కేసు విషయంలో అబ్దుల్ బాసిత్ (43) అనే వ్యక్తిని పాకిస్థాన్ పోలీసులు గతంలో అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు చివరకు ఉరిశిక్ష విధించింది. కోర్టు విధించిన శిక్ష ప్రకారం అతడిని పంజాబ్‌లోని ఫైసలాబాద్ జైలులో మంగళవారం ఉదయమే ఉరితీయాలి. కానీ, అతడి విషయంలో గత కొంతకాలంగా హక్కుల సంఘంవారు పలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆ నేరస్థుడు ఒక వికలాంగుడు. ప్రస్తుతం అతడు చక్రాల కుర్చీ మీద ఉండే జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. స్థానిక చట్టాల ప్రకారం ఓ వ్యక్తిని ఉరితీసేముందు అతడు ఉరికంభం వద్ద నిల్చుని ఉన్నప్పుడే తలారీ అతడి మెడకు ఉరితాడు బిగించాలి. కానీ బాసిత్ వికలాంగుడు కావడం వల్ల నిల్చునే అవకాశం లేదు. దీనిపై ఇప్పటికే జైలు అధికారులు పంజాబ్ హోంశాఖను అభిప్రాయం కోరినా ఉరిశిక్ష అమలు తేదీ వరకు కూడా వారు ఓ నిర్ణయం ప్రకటించకపోవడంతో ఉరి శిక్షను తాత్కాలికంగా నిలిపివేసి తలలు పట్టుకున్నారు. 2009లో బాసిత్ ఓ ఆస్తి వివాదానికి సంబంధించి ఓ వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం టీబీ కారణంగా పక్షవాతానికి గురయ్యాడు. పక్షవాతంతోనే అతడు వీల్ చైర్లో ఉండి జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. -
వికలాంగుడిని వివాహం చేసుకున్న యువతి