
న్యూఢిల్లీ: దివ్యాంగులు సైతం ఐపీఎస్, ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలి, లక్షద్వీప్ పోలీసు సర్వీసు(డీఏఎన్‌ఐపీఎస్), ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసు(ఐఆర్‌పీఎఫ్‌ఎస్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలియజేసింది. సివిల్ సర్వీసెస్‌లతో ఆయా సర్వీసులను ప్రాధాన్యతలుగా ఎంచుకోవడానికి అనుమతించింది.
సంబంధిత దరఖాస్తు పత్రాలను ఏప్రిల్1లోగా యూపీఎస్సీకి సమర్పించాలని దివ్యాంగ అభ్యర్థులకు సూచించింది. ఐపీఎస్, డీఏఎన్‌ఐపీఎస్, ఐఆర్‌పీఎఫ్‌ఎస్ పోస్టుల నుంచి దివ్యాంగులను మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 18న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.
చదవండి: (Ukraine Russia War: కీవ్‌లో కల్లోలం.. ఏ క్షణంలోనైనా)