సాక్షి, నిర్మల్: బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన కూచాడి శ్రీహరిరావు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ క్రమంలో త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. దీంతో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్ తగలింది.
వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినప్పటికీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమకు గుర్తింపు లేకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీహరిరావు అన్నారు. ఈ క్రమంలో సోమవారం జిల్లా కేంద్రంలో తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వచించారు. ఈ సందర్భంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ తెలంగాణలో రెండోసార్లు అధికారంలోకి వచ్చి ప్రజలను వంచించిందన్నారు. అలాంటి మోసాలను చేయడం ఇష్టం లేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు కామెంట్స్ చేశారు. ఇక, ఈనెల 17లోగా శ్రీహరి రావు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక, శ్రీహరిరావు.. 2007లో టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా శ్రీహరిరావు ఉన్నారు. అంతకుముందు, బహిరంగ సభల్లో ప్రతిసారి శ్రీహరిరావుతో ఉన్న తన అనుబంధాన్ని కేసీఆర్ పంచుకున్నారు. శ్రీహరిరావుతో గతంలో బీజేపీ నేతలు సైతం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కానీ, ఆయన మాత్రం కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు.
ఇది కూడా చదవండి: ధరణి పోర్టల్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment