srihari rao
-
కేసీఆర్ కు బిగ్ షాక్... కాంగ్రెస్ లో చేరిన శ్రీహరి రావు
నిర్మల్: రాజకీయంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్మల్ ఓ కేంద్రబిందువుగా కొనసాగుతోంది. త్వరలోనే ఎన్నికలు రానున్నవేళ జిల్లాలో చోటుచేసుకుంటున్న మార్పులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఉద్యమనేత, బీఆర్ఎస్ అసమ్మతి నాయకుడు కూచాడి శ్రీహరిరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంపై చర్చమొదలైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరడమే ఇందుకు కారణం. ఆయన హస్తంగూటికి చేరడంతో తమకెలాంటి ఇబ్బంది లేదని చెబుతున్న బీఆర్ఎస్, బీజేపీ క్షేత్రస్థాయిలో మరింత ఆరాతీస్తున్నాయి. ఇక దేశం, రాష్ట్రమంతటా ఎలా ఉన్నా.. జిల్లాలో రాజకీయ పరిస్థితులు కొంత భిన్నంగా ఉండటం సహజం. ఇక్కడ క్యాడర్ కాదు కదా.. కనీసం ఎన్నికల గుర్తు కూడా సరిగ్గా తెలియని పార్టీలు ఘనంగా గెలిచిన రోజులున్నాయి. అందుకే శ్రీహరిరావు కాంగ్రెస్‌లో చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మాభిమానం కోసం.. తను కావాలనుకుంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి పనులు చేయించుకోగలను, కానీ.. ఉద్యమకారులకు గుర్తింపులేని చోట ఆత్మాభిమానం చంపుకొని ఉండలేనంటూ కూచాడి శ్రీహరిరావు కాంగ్రెస్‌గూటికి చేరారు. తనకు రాజకీయగురువుగా పేర్కొనే మంత్రి ఇంద్రకరణ్రెడ్డినే ఢీకొనేందుకు రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తం కండువా వేసుకున్నారు. గత ఎన్నికల్లో కారు గుర్తు గెలుపుకోసం ఎంత శ్రమించినా కనీసం ఇచ్చిన హామీమేరకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోవడమూ కూచాడి కాంగ్రెస్ వైపు వెళ్లడానికి కారణమన్న వాదనలున్నాయి. ఏదిఏమైనా గత ఎన్నికల్లోనే పోటీకి తమనేత దూరంగా ఉన్నారని, ఈసారైనా పోటీచేస్తేనే తనకు, తమకు ఉనికి ఉంటుందన్న వాదనను ఆయన అనుచరులు బలంగా వినిపిస్తున్నారు. అందుకే వారంతా ఆయన వెంటే కాంగ్రెస్బాట పట్టారు. లాభమేనంటున్న బీజేపీ.. శ్రీహరిరావు బీఆర్ఎస్లో ఉంటే ఇబ్బంది కానీ కాంగ్రెస్‌లో చేరితే తమకే లాభమన్న వాదనను బీజేపీ నాయకులు వినిపిస్తున్నారు. ఒకవేళ ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే చీల్చేది బీఆర్ఎస్ ఓట్లేనని చెబుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న మైనార్టీ ఓట్లు కూడా రెండు పార్టీల మధ్య చీలితే మెజార్టీ ఓట్లు తమకే వస్తాయన్న అంచనాలు వేస్తున్నారు. ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాల్లో కూచాడి ప్రభావం పెద్దగా ఉండదని, నిర్మల్‌లో ఆయన రాక వందశాతం తమ పార్టీకే లాభమన్న భావన బీజేపీనుంచి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లో జోష్ పెరిగేనా? ఏఐసీసీ స్థాయికి ఎదిగిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రా మారావుపటేల్ తదితరులు వెళ్లిపోవడంతో జి ల్లాలో కాంగ్రెస్ కుదేలైంది. మళ్లీ కోలుకుంటుందో లేదోనన్న స్థాయికి దిగజారింది. ఒకరిద్దరు నేతలు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ నాయకులెవరూ మిగల్లేదు. ఇలాంటి సందర్భంలో సారంగపూర్ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ప్రముఖ న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి చేర డం, యువనాయకులు అర్జుమంద్‌అలీ, జునై ద్, సేవాదళ్ మాజీ నేత ఎంబడి రాజేశ్వర్ తది తరులు యాక్టివ్ కావడం కొంత ఊరటనిచ్చింది. అయినా ఎన్నికల్లో పోటీచేసే స్థాయిలో లేదనుకుంటున్న సమయంలో శ్రీహరిరావు చేరడం కాంగ్రెస్‌లో కొంత జోష్ నింపింది. అంతా అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో రానున్న ఎన్నికలపై ఆశలు పెట్టుకునేస్థాయికి పార్టీ చేరడంతో క్యాడర్ సంతృప్తి వ్యక్తంచేస్తోంది. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. గులాబీ పార్టీకి కేసీఆర్ సన్నిహితుడు గుడ్‌బై
సాక్షి, నిర్మల్: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన కూచాడి శ్రీహరిరావు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ క్రమంలో త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. దీంతో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు ఊహించని షాక్ తగలింది. వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినప్పటికీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమకు గుర్తింపు లేకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీహరిరావు అన్నారు. ఈ క్రమంలో సోమవారం జిల్లా కేంద్రంలో తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వచించారు. ఈ సందర్భంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తెలంగాణలో రెండోసార్లు అధికారంలోకి వచ్చి ప్రజలను వంచించిందన్నారు. అలాంటి మోసాలను చేయడం ఇష్టం లేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు కామెంట్స్ చేశారు. ఇక, ఈనెల 17లోగా శ్రీహరి రావు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక, శ్రీహరిరావు.. 2007లో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా శ్రీహరిరావు ఉన్నారు. అంతకుముందు, బహిరంగ సభల్లో ప్రతిసారి శ్రీహరిరావుతో ఉన్న తన అనుబంధాన్ని కేసీఆర్ పంచుకున్నారు. శ్రీహరిరావుతో గతంలో బీజేపీ నేతలు సైతం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కానీ, ఆయన మాత్రం కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇది కూడా చదవండి: ధరణి పోర్టల్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు -
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై గులాబీ పార్టీ నేతల అసంతృప్తి
-
అభివృద్ధి ప్రదాత శ్రీహరిరావు కన్నుమూత
కె.గంగవరం (రామచంద్రపురం) : నియోజకవర్గంలో వివిధ ఆలయాల నిర్మాణానికి కృషి చేసి, పలు ఆలయాల నిర్వహణకు నగదు డిపాజిట్ చేసిన దాత చిలుకూరి శ్రీహరిరావు (80) కన్నుమూశారు. కోటిపల్లికి చెందిన శ్రీహరిరావు సోమవారం అనారోగ్యానికి గురికావడతో రాజమహేంద్రవరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఆయనకు సంతానం లేరు. వితరణశీలిగా గుర్తింపు పొందిన శ్రీహరావు పలు ఆలయాలకు ఫిక్సిడ్ డిపాజిట్లు చేసి దాని ద్వారా వచ్చే వడ్డీతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత ఈఓలకు సూచించారు. మరణానంతరం తన శరీరాన్ని వైద్య విద్యార్థులకు ప్రయోగాల కోసం దానం చేయాలని ముందుగానే తెలియజేశారు. దీంతో ఆయన పార్థివ దేహాన్ని కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు అప్పగించారు. ఆయన మృతికి ఆలయ తనిఖీదారు వి.వెంకటేశ్వరరావు, ఈఓలు కె.రామచంద్రరావు, పి.వి.చలపతిరావు, కె.సుబ్రహ్మణం, దేవాదాయ సిబ్బంది సంతాపం తెలిపారు. -
‘ముంపు’ బాధితులూ ఆందోళన వద్దు
రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు గజ్వేల్ రూరల్: ‘మల్లన్న సాగర్’ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న ముంపు గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చెందవద్దని, వారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకునేందుకు సిద్ధమవుతుందని రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలు, రైతులను ప్రతిపక్షాలు ఆయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం 2013చట్టం ప్రకారం మెరుగైన పరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. భూములు, ఇండ్లు, ఇతర వనరులు కోల్పోతున్న ప్రజలు, రైతులందరికి పరిహారంతో పాటు డబుల్ బెడ్రూం ఇంటి సౌకర్యం కల్పించేందుకు సిద్దంగా ఉందని, ‘మల్లన్న’ బాధితులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలన్నారు. సమావేశంలో సిద్దిపేట డివిజన్ ఇన్‌ఛార్జి మారెడ్డి రామలింగారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ కన్వీనర్ పి. వెంకట్రాంరెడ్డి, నాయకులు నర్సింలుగౌడ్, రమేష్‌గౌడ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
విఠలాపురంలో ఇరువర్గాల ఘర్షణ
తాళ్లూరు, న్యూస్‌లైన్ : దారి విషయంలో తలెత్తిన వివాదం ఇరువర్గాల ఘర్షణకు దారి తీయడంతో 14 మంది గాయపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది. ఈ సంఘటన మండలంలోని విఠలాపురంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. విఠలాపురం- రమణాలవారిపాలెం రోడ్డు అడ్డదారి యానాది బజారులో ఉన్న దిబ్బ విషయమై కొంతకాలంగా ఇరువార్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్గత రోడ్లకు మట్టి తోలుకోవాలని గ్రామస్తులు కొందరు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా దిబ్బలను తొలగించాలని వాటి యజమానులైన కురిచేటి పిచ్చయ్య, ఆయన తమ్ముళ్లను కోరారు. తమకు ఒకరోజు సమయమిస్తే తొలగిస్తామని వారు చెప్పారు. ఇంతలో అంతర్గత రోడ్లకు మట్టి తోలుకుంటున్నారని గ్రామంలోని కొందరు స్థానిక కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కార్యదర్శి సురేష్ వచ్చి ఎన్నికల సమయంలో మట్టి తోలుకోవద్దని గ్రామస్తులతో చెప్పారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, రోడ్లపైనే దిబ్బలు ఉన్నా ఎందుకు తొలగించలేదని కొందరు మహిళలు కార్యదర్శిని ప్రశ్నించారు. రోడ్ల వెంబడి దిబ్బల తొలగింపునకు చర్యలు తీసుకుంటానని కార్యదర్శి హామీ ఇచ్చారు. ఇంతలో వివాదం చెలరేగి ఇరువర్గాలూ దాడికి దిగాయి. క్షణాల్లో పరిస్థితి అదుపు తప్పింది. దాడిలో ఇరువర్గాలకు చెందిన 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు తాళ్లూరు, దర్శి వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. ఎస్సై శ్రీహరిరావు తన సిబ్బందితో అక్కడికి వచ్చి గ్రామంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులపై పోలీసు జులుం విషయం తెలుసుకునేందుకు వచ్చిన విఠలాపురం కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు వెంకటేశ్వరరెడ్డిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. గ్రామ నాయకుడు పాలెం సుబ్బారెడ్డి, కొందరు మహిళల పట్ల ఖాకీలు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరును వైఎస్సార్ సీపీ నాయకులు ఖండించారు.