అభివృద్ధి ప్రదాత శ్రీహరిరావు కన్నుమూత
Published Tue, Jan 17 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
కె.గంగవరం (రామచంద్రపురం) :
నియోజకవర్గంలో వివిధ ఆలయాల నిర్మాణానికి కృషి చేసి, పలు ఆలయాల నిర్వహణకు నగదు డిపాజిట్ చేసిన దాత చిలుకూరి శ్రీహరిరావు (80) కన్నుమూశారు. కోటిపల్లికి చెందిన శ్రీహరిరావు సోమవారం అనారోగ్యానికి గురికావడతో రాజమహేంద్రవరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఆయనకు సంతానం లేరు. వితరణశీలిగా గుర్తింపు పొందిన శ్రీహరావు పలు ఆలయాలకు ఫిక్సిడ్ డిపాజిట్లు చేసి దాని ద్వారా వచ్చే వడ్డీతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత ఈఓలకు సూచించారు. మరణానంతరం తన శరీరాన్ని వైద్య విద్యార్థులకు ప్రయోగాల కోసం దానం చేయాలని ముందుగానే తెలియజేశారు. దీంతో ఆయన పార్థివ దేహాన్ని కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు అప్పగించారు. ఆయన మృతికి ఆలయ తనిఖీదారు వి.వెంకటేశ్వరరావు, ఈఓలు కె.రామచంద్రరావు, పి.వి.చలపతిరావు, కె.సుబ్రహ్మణం, దేవాదాయ సిబ్బంది సంతాపం తెలిపారు.
Advertisement
Advertisement