భారత్, చైనా, జపాన్లతో దాతల సమావేశం...సాయం కోరుతున్న శ్రీలంక
Lanka Plans Donor Conference: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రీలంకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి తమ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయటం ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం అక్కడ ప్రజలు తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అదీగాక విదేశీ మారక నిల్వలు కొరత కారణంగా ఇంధనం, మందులతో సహా నిత్యావసరాలను దిగుమతి చేసుకోలేని దారుణ స్థితిలో ఉంది.
ఏవిధంగానైన ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంక కొత్త ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విదేశీ సహాయం కోరుతూ చైనా, భారత్, జపాన్లతో దాతాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే పేర్కొన్నారు. తమకు చారిత్రాత్మక మిత్రదేశాలుగా ఉన్న ఈ దేశాల సాయంతోనే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాం అని అన్నారు.
అమెరికా నుంచి కూడా సాయం తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు న్యూఢిల్లీ నుంచి అదనపు మద్దతుపై చర్చల కోసం భారత్ నుంచి అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం వస్తుందని, అలాగే యూఎస్ ట్రెజరీ నుంచి ఒక బృందం వచ్చేవారం శ్రీలంక రానుందని వెల్లడించారు. అదీగాక భారత్ శ్రీలంకకి సుమారు రూ. 2 లక్షల కోట్లు సాయం అందించిన సంగతి తెలిసిందే.
కొన్ని దిగుమతుల కోసం దాదాపు 1.5 బిలయన్ డాలర్ల ( దాదాపు రూ.11 కోట్లు) యువాన్ డినామినేట్ స్వాప్ నిబంబధనలపై చర్చలు జరపాలని చేసిన శ్రీలంక చేసిన విజ్ఞప్తిని చైనా పరీశీలిస్తుందని తెలిపారు. అంతేగాక శ్రీలంక వాణిజ్య రాజధాని కొలంబో చేరుకున్న ఐఎంఎఫ్ బృందంతో చర్చలు పురోగతి సాధించాయని, ఈ నెలాఖరులోగా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విక్రమ్ సింఘే చెప్పారు.
(చదవండి: క్షణాల్లో అంటుకున్న మంటలు, వీడియో వైరల్)