TG: దిలావర్‌పూర్‌లో మరోసారి ఉద్రిక్తత | High Tension In Nirmal District Dilawarpur In Telangana | Sakshi
Sakshi News home page

TG: దిలావర్‌పూర్‌లో మరోసారి ఉద్రిక్తత.. పోలీసులను తరిమిన గ్రామస్తులు

Published Wed, Nov 27 2024 12:17 PM | Last Updated on Wed, Nov 27 2024 1:12 PM

High Tension In Nirmal District Dilawarpur In Telangana

సాక్షి,నిర్మల్‌జిల్లా: జిల్లాలోని దిలావర్‌పూర్‌లో బుధవారం(నవంబర్‌27) ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తుల పోరాటం కొనసాగుతోంది. ఇక్కడ మంగళవారం జరిగిన ధర్నా సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్టు చేయడంపై గ్రామస్తులు బుధవారం ఉదయం స్థానిక పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసనకు దిగారు.

ఈ క్రమంలో శాంతిభద్రతలను కాపాడేందుకుగాను పోలీసులు గ్రామ ప్రజలను నిర్మల్- కళ్యాణ్ నేషనల్ హైవేపైకి రానివ్వలేదు. దీంతో పోలీసులను తరుముకుంటూ వారిపై రాళ్లదాడి చేస్తూ గ్రామస్తులు నేషనల్‌హైవేపైకి చేరుకున్నారు. పోలీసుల వాహనాలపైనా గ్రామస్తులు రాళ్లదాడి చేశారు. పరిస్థితి విషమించడంతో ఘటనాస్థలం నుంచి పోలీసులు తమ వాహనాలను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇదీ చదవండి: నిర్మల్‌ పల్లెల్లో ఇథనాల్‌ మంట


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement