
కోవిడ్‌ను కాచుకునేందుకు వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. దీంతో టీకా కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. మరోవైపు కరోనా కట్టడికి కఠినంగా ఆంక్షలు కొనసాగిస్తున్నారు పోలీసులు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘించిన వారికి నిర్మల్ జిల్లా పోలీసులు వినూత్న శిక్షలు అమలు చేస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. చమురు ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో వాహనదారులు బ్యాటరీ వాహనాల పట్ల మొగ్గు చూపుతున్నారు.

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించే వారికి నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ వినూత్న రీతిలో శిక్షలు విధిస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వస్తే.. వారిని నేరుగా కరోనా టెస్టులకు పంపిస్తున్నారు. పాజిటివ్ వస్తే క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. నెగెటివ్ వచ్చిన వారి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్

లాక్‌డౌన్ అమలులో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై బాటసింగారం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్ట్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట రాచ కొండ సీపీ మహేశ్ భగవత్, అదనపు కమిషనర్ సుధీర్‌బాబు, ఎల్‌బీ నగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఉన్నారు. – అబ్దుల్లాపూర్‌మెట్ (హైదరాబాద్)

కరోనా వ్యాక్సిన్ కోసం శుక్రవారం సికింద్రాబాద్ ముషీరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో బారులు తీరిన నగరవాసులు

రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు మనుమరాలు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్, షమిత దంపతుల కూతురి వివాహం శుక్రవారం మాదాపూర్‌లోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. సీఎం కేసీఆర్ ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

విజయనగరం సమీపంలోని పెద్ద చెరువులో సాయం సంధ్యా సమయాన సైబీరియా పక్షులు పరిసర ప్రాంతవాసులకు కనువిందు చేస్తున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం ఇలా పక్షులు చెరువులో ఈత కొడుతూ...ఎగురుతూ సందడి చేస్తుండడంతో అటుగా వెళ్లేవారు కాసేపు నిలబడి వీక్షిస్తున్నారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, విజయనగరం

బ్యాటరీ బైక్‌లకు రానురానూ ఆదరణ పెరుగుతోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న బైక్ కూడా ఇదే తరహాదే. రోజుకు 6 గంటలు చార్జింగ్ పెడితే 90 కిలోమీటర్లు రయ్‌మంటూ వెళ్లిపోవచ్చు. అంతేకాక దాదాపు 150 కిలోల బరువు కూడా మోసుకెళ్తుంది. రూ. 40వేల ఖరీదైన ఈ బైక్‌పై ఓ బ్యాంకు ఉద్యోగి విజయవాడ బందరు రోడ్డులో వెళ్తుండగా సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి, ఫొటోగ్రాఫర్, విజయవాడ

ముంబై పశ్చిమ శివారు ప్రాంతంలో శుక్రవారం ఎంఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెట్రో లైన్ 2ఏ, లైన్7 పనులు

రాజస్తాన్‌లోని జైపూర్ నగరాన్ని శుక్రవారం ధూళి తుపాను కప్పేసింది. ఆకాశమంతా ధూళితో నిండిపోయింది.

కరోనా నుంచి కోలుకుని శుక్రవారం థానే మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన కోవిడ్ పునరావాస సంరక్షణ కేంద్రంలో యోగా, వ్యాయామం చేస్తున్న బాధితులు

పెంపుడు కుక్కలకు తర్ఫీదునిచ్చే ఇతడి పేరు నొబువాకి మోరిబే. జపాన్ రాజధాని టోక్యోలో తన క్లయింట్లకు చెందిన కుక్కలతో నడిచి వెళ్తుండగా అందరూ ఆసక్తిగా తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment