siberian birds
-
ఫజుల్లాబాద్‌కు విదేశీ పక్షులు.. ప్రాణంగా చూసుకుంటాం..
రంపచోడవరం: విదేశీ పక్షుల రాకతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామం సందడిగా మారింది. సుమారు వెయ్యికి పైగా సైబీరియా పక్షులు గ్రామానికి తరలివచ్చాయి. గ్రామంలోని చెట్లను ఆవాసంగా మార్చుకున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆగమనంతో ఇవి ఏటా ఇక్కడికి చేరుకుంటాయి. మధ్య ఆసియాలోని సైబీరియా కన్నా ఈ ప్రాంతంలో వేడి వాతావరణం ఉండటం వీటి సంతానోత్పత్తికి అనుకూలం. అందువల్ల ఏటా జూలై, ఆగస్టులో వచ్చి కార్తీక మాసం చివరి వరకు ఇక్కడే ఉంటాయి. సంతానోత్పత్తి అనంతరం పిల్లలతో ఇక్కడి నుంచి వెళ్లిపోతాయని గ్రామస్తులు తెలిపారు. ఒంటరిగా ఈ ప్రాంతానికి వచ్చే విదేశీ పక్షులు ఇక్కడ సుమారు ఐదు నెలలపాటు ఉంటాయి. వీటిని అతిథులు మాదిరిగా గ్రామస్తులు చూసుకుంటారు. తమ తాతల కాలం నుంచి ఈ పక్షులు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో గ్రామంలోని పక్షులకు ఎవరైనా హాని తలపెడితే పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏటా గ్రామానికి వస్తుండటంతో వాటికి ఎటువంటి హాని జరగకుండా ప్రాణంగా చూసుకుంటున్నారు. ఐదు నెలలపాటు గ్రామంలో చింతచెట్లపైనే ఉంటున్నాయి. గతంలో ఏటా రెండు వేలకు పైగా పక్షులు వచ్చేవి. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు వెయ్యికి తగ్గిపోయిందని గ్రామస్తులు తెలిపారు. జూలై నెలలో వచ్చి చెట్లపై గూడు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలను చేసి నవంబరు నెలాఖరులోపు వెళ్లిపోతాయి. ఫజుల్లాబాద్ గ్రామానికి చుట్టుపక్కల పంటపొలాలు, చెరువులు ఉన్నందున ఆహారం లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కోతుల బెడద ఎక్కువైంది. పక్షలు గూళ్లను పాడు చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ప్రాణంగా చూసుకుంటున్నాం గ్రామంలో ఉండే కొంగలకు ఎవరు హాని తలపెట్టారు. మొదట్లో వాటిని పట్టుకునేందుకు వేటగాళ్లు ప్రయత్నించారు. గ్రామస్తులంతా అడ్డుకున్నారు. అప్పటినుంచి ఎవరూ హాని తలపెట్టరు. వాటిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాం. ఈ పక్షులను తిలకించేందుకు పర్యాటకులు వస్తుంటారు. – ధర్మరాజు, ఫజుల్లాబాద్, దేవీపట్నం మండలం -
అల వీరాపురంలో అతిథులు.. చూసొద్దాం రండి!
సాక్షి,హిందూపురం(అనంతపురం): ఐదు నుంచి ఆరు అంగుళాల గోధుమ వర్ణంతో వంపు తిరిగిన పొడవాటి ముక్కు.. తెలుపు రంగులో మెడ, తల, వీపు.. ఎరుపు, గుళాబీ మిళితమైన రెక్కల కొనలు.. రెక్కల మధ్య, మెడ కింద ముదురు ఆకుపచ్చ రంగు, కాళ్లు తొడల వరకు తెలుపు రంగుతో కూడిన పక్షులు చిలమత్తూరు మండలం వీరాపురంలో సందడి చేస్తున్నాయి. ఇవి రష్యా దేశంలోని సైబీరియన్ ప్రాంతానికి చెందిన స్టార్క్ పెయింటెడ్ పక్షులు. సమ శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతాల్లో జీవించే ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం వేల మైళ్ల దూరం నుంచి ఏటా వీరాపురం వస్తుంటాయి. ముందుగా జనవరిలోనే కొన్ని పక్షులు వచ్చి ఇక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తాయి. అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత తమ దేశానికి వెళ్లి మిగతా పక్షులతో తిరిగి వస్తాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో వీరాపురంతో పాటు వెంకటాపురం, పరిసర ప్రాంతాల చెరువుల్లో నీరు చేరింది. అటవీ శాఖ అధికారులు చెరువుల్లోకి చేప పిల్లలను సైతం వదిలారు. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి నెలలోపు ఇక్కడకు పక్షులు వలస వచ్చి చెట్లపై నివాసాలు ఏర్పాటు చేసుకుని సందడి చేస్తున్నాయి. నెలరోజుల తర్వాత ఆడ పక్షి మూడు లేదా నాలుగు గుడ్లు పెడుతుంది. గుడ్ల వద్ద ఒక పక్షి కాపలా ఉంటే.. మరో పక్షి ఆహారం సేకరించుకుని వస్తుంది. ఆరు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో గుడ్లు పొదుగుతాయి. రెండు నెలలు పాటు పిల్లలకు ఆహారం అందజేస్తాయి. పిల్ల పక్షులు ఎగిరే దశకు చేరుకున్నాక అవే ఆహారం కోసం వెళ్లి వస్తాయి. సంతానం ఎదిగిన తర్వాత అన్నీ కలిసి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోపు తిరిగి స్వస్థలానికి వెళ్లిపోతాయి. -
Photo Feature: కనిపిస్తే.. కరోనా టెస్టులే..
కోవిడ్‌ను కాచుకునేందుకు వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. దీంతో టీకా కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. మరోవైపు కరోనా కట్టడికి కఠినంగా ఆంక్షలు కొనసాగిస్తున్నారు పోలీసులు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లఘించిన వారికి నిర్మల్ జిల్లా పోలీసులు వినూత్న శిక్షలు అమలు చేస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. చమురు ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో వాహనదారులు బ్యాటరీ వాహనాల పట్ల మొగ్గు చూపుతున్నారు. -
వి'హంగామా'.. ఎక్కడమ్మా!
పర్యాటకులను అమితంగా ఆకర్షించే విదేశీ విహంగాలు నెలరోజుల ముందే సొంతగూటికి పయనమయ్యాయి. పిల్లలతో కలిసి వేలాది కిలోమీటర్లు పయనమై వెళ్లిపోతున్నాయి. ఈ హఠాత్పరిణామం తేలుకుంచి వాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. తమకు తెలిసినంత వరకు ఇలా ఏ ఏడాదీ జరగలేదని, నెల రోజుల ముందుగానే సైబీరియా పక్షులు ఎందుకు వెళ్లిపోతున్నాయో అంతుపట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు. సాక్షి, ఇచ్ఛాపురం రూరల్: ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్ తర్వాత స్వదేశాలకు వెళ్లే సైబీరియా పక్షులు ఈ ఏడాది నెల రోజుల ముందే పుట్టింటికి పయనమైపోయాయి. జిల్లాలో తేలినీలాపురం తర్వాత సైబీరియన్ పక్షులు విడిది చేసేది ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామంలోనే. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తొలకరి జల్లులు కురిసే సమయంలో ఇక్కడికి వచ్చిన విదేశీ విహంగాలు సంక్రాంతి రాకముందే ఒక్కసారిగా వెళ్లిపోయాయి. కార్తీకమాసం తర్వాత సంతానోత్పత్తితో రెట్టింపు సంఖ్యలో స్వస్థలాలకు వెళ్లే ఈ పక్షులకు ఏమైందో ఏమోగాని అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఈ విధంగా పక్షులు దూరం కావడంతో గ్రామస్తులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. విభిన్న పక్షులు.. ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్‌లో సైబీరియా నుంచి వచ్చిన ఈ పక్షుల అసలు పేరు ఓపెన్ బిల్ స్టార్క్స్ (నత్తగొట్టు కొంగలు, చిల్లు ముక్కు కొంగలు). శాస్తీయ నామం ‘అనస్థోమస్’. ఈ పక్షులు తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక నుంచి మొదలుకొని తూర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. దవడల మధ్య (ముక్కు మధ్యలో) ఖాళీ ఉండటం వల్ల వీటిని ఓపెన్ బిల్ స్టార్క్స్ అని పిలుస్తుంటారు. వందల కొద్దీ ఇక్కడికి వచ్చిన పక్షులు గ్రామంలోనే ఊర చెరువు, గ్రామదేవత ఆలయం వద్ద ఉన్న కంచి చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుని గుడ్లు పొదుగుతాయి. పగలంతా తంపర భూములు, వరి చేలల్లో తిరుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా తీసుకుంటాయి. ఆరు నెలలు పాటు పిల్లలతో గడిపి అవి ఎగిరేంత బలం రాగానే జనవరి నెల మధ్య నుంచి తమ ప్రాంతాలకు పయనమవుతుంటాయి. ఈసారి ఏమైందో.. ఈ ఏడాది ఒక్కసారిగా పక్షులు మాయమైపోయాయి. తిరుగు ప్రయాణానికి ఇంకా సమయం ఉండగానే ఒక్కసారిగా గ్రామాన్ని వదిలిపోవడం స్థానికులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. వీటి రాకతో తొలకరి పనులు ప్రారంభించడం ఈ ప్రాంత రైతులకు అలవాటు. అలాంటిది పక్షులు హఠాత్తుగా మాయం కావడం శుభకరం కాదంటున్నారు. ఈ పక్షులు పురుడు పోసుకునేందుకు తమ ఇంటికి వచ్చిన ఆడపడుచుల్లా ఈ గ్రామస్తులు భావిస్తుంటారు. నివాసానికి అనువుగా లేనందునే.. పక్షులు వెళ్లిపోవడానికి ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోవడం ఒక కారణమైతే, పక్షులు గుడ్లు పెట్టేందుకు సరైన చెట్లు లేకపోవడం మరోకారణమని స్థానికులు భావిస్తున్నారు. గతంలో వరుసగా వచ్చిన తుఫాన్ల ధాటికి చెట్లు నేలకొరగడంతో కొత్త మొక్కలు నాటేందుకు స్థలం లేకపోవడంతో అటవీశాఖాధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. వర్షాలు పుష్కలంగా కురిస్తే వాగులు, వంకలు నిండి పక్షులకు ఆహారంగా వరిచేలల్లో నత్తలు, పురుగులు, చేపలు, కప్పలు తింటూ జీవిస్తుంటాయి. అయితే ఈ ఏడాది అవి ఉండేందుకు అనువైన వాతావరణం లేని కారణంగా వేగంగా స్వదేశాలకు పయనమైపోయాయని స్థానికులు చెబుతున్నారు. అపురూపంగా చూసుకున్నాం ఈ పక్షుల్ని మా ఊర్లో ఎవరినీ కొట్టనివ్వరు. అపురూపంగా చూసుకుంటాం. ఈ ఏడాది పక్షులకు వాతావరణం అంతగా అనుకూలంగా లేకుండాపోయింది. మోస్తరు వర్షాలు కురవకపోవడంతో అంతంత మాత్రంగా పంటలు పండటం, పక్షులకు ఆహారమైన పురుగులు, కీటకాలు లేకపోవడంతోనే పక్షులు నెల రోజులు ముందుగా వెళ్లిపోయాయి. – దక్కత నూకయ్యరెడ్డి, గ్రామపెద్ద, తేలుకుంచి మొక్కలు నాటించలేదు.. అటవీశాఖ అధికారులు ఏడాదికోమారు గ్రామంలో సమావేశం పెట్టి చేతులు దులుపుకుంటున్నారే తప్పా పక్షులను పర్యవేక్షించే చర్యలు చేపట్టడం లేదు. స్థానిక ఎమ్మేల్యే బెందాళం అశోక్ మా గ్రామాన్ని దత్తత తీసుకున్నా పక్షులు నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొక్కలు నాటించలేకపోయారు. – పాల ధర్మరాజురెడ్డి, యువజన సభ్యుడు, తేలుకుంచి -
విహంగమా.. ఎటు వెళ్లిపోయావమ్మా..
సాక్షి, రాజానగరం: ఓపెన్ బిల్ బర్డ్స్‌గా పిలిచే ఈ పక్షులు రాజమహేంద్రవరానికి అత్యంత చేరువలో ఉన్న పుణ్యక్షేత్రానికి ఏటా జూన్, జూలై మాసంలో (తొలకరి చినుకులు పడే సమయం) క్రమం తప్పకుండా సైబిరీయా నుంచి ఇక్కడకు వలస వస్తుంటాయి. వీటి ముక్కు మధ్యలో రంధ్రంగా ఉండటంతో స్థానికులు ‘చిల్లు ముక్కు కొంగ’లని కూడా పిలుస్తుంటారు. వందల కొలదిగా ఇక్కడకు వచ్చిన ఈ పక్షులు గ్రామంలోని ఊర చెరువు చుట్టూ ఉన్న కంచి చెట్లపై గూళ్లు ఏర్పాటుచేసుకుని గుడ్లు పొదుగుతాయి. వాటి నుంచి పిల్లలు బయలు దేరిన తరువాత డిసెంబర్, జనవరి మాసంలో (మాఘమాసంలో) ఆ పిల్ల పక్షులతో కలసి వేల కొలదిగా ఇక్కడ నుంచి తిరిగి పయనమవుతాయి. మళ్లీ జూన్, జూలై మాసం వచ్చే వరకు వీటి జాడ ఎవరికీ తెలియదు. పక్షుల జాడ లేక బోసిపోయిన ఊర చెరువు ఏమైందో ఏమో.. కాని ఈసారి ఏమైందో ఏమోగాని ఒక్కసారిగా మాయమైపోయి. గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు సమీపంలోని ఊర చెరువు చుట్టూ ఉన్న కంచివిత్తనం చెట్లపై ఉండే ఈ పక్షులు తిరుగు ప్రయాణానికి ఇంకా సమయం ఉండగా రెండు నెలలు ముందే ఒక్కసారిగా గ్రామాన్ని వదిలిపోవడం గ్రామస్తులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. వీటి రాకతో తొలకరి పనులు ప్రారంభించే ఈ ప్రాంత రైతులు పక్షులు హఠాత్తుగా మాయం కావడంతో ఇది శుభకరం కాదంటూ సెంటిమెంటుగా ఫీలవులున్నారు. కొందరైతే ఇవి మాయమైన నెల రోజుల నుంచి మాకు ఆరోగ్యాలు కూడా బాగుండడం లేదంటున్నారు. ఎందుకంటే వీటిని పురుడు పోసుకునేందుకు తమ ఇంటికి వచ్చిన ఆడపడుచుల్లా భావిస్తారు. తమ తాతముత్తాల కాలం నాటి నుంచి ఈ విధంగా క్రమం తప్పకుండా వలస వచ్చే ఈ విదేశీ విహంగాలపై ఆ గ్రామస్తులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు హద్దులు ఉండవు. ఆకాశంలో విహరిస్తున్న పక్షి (ఫైల్) వీటిని విదేశీ పక్షులంటే పుణ్యక్షేత్రం వాసులు అసలు అంగీకరించరు. ఎందుకంటే అవి పుట్టింది ఇక్కడేనంటారు. ఈ సమయంలో ఇక్కడకు వచ్చి సంతానోత్పత్తిని చేసుకుని తిరిగి వెళ్తున్నాయి కాబట్టి విదేశీ పక్షులనడం సరికాదంటారు. అందుకనే వాటిని పురిటికి పుట్టింటికి వచ్చే ఆడపడచుల్లా భావించి, ఆదరిస్తారు. నెత్తిమీద రెట్ట వేసినా, చంకన ఉన్న పసివాడు దుస్తుల్ని ఖరాబు చేసిన మాదిరిగా వాటిని కూడా చూస్తారేగాని చీదరించుకోరు. గూళ్లకు చేరుకునే సమయంలో ఆ పక్షులు పెట్టే కీచుకీచు ధ్వనులను కూడా పిల్లల సందడిగానే భావిస్తారుగాని ‘ఇదేం గోలరా బాబూ’ అని ఈసడించుకోరు. గూళ్ల నుంచి పక్షి పిల్లలు జారి పడితే వాటిని జాగ్రత్తగా తిరిగి ఆ గూళ్లలోనే చేరవేస్తారు. అసలు తమ గ్రామానికి ‘పుణ్యక్షేత్రం’ అనే పేరు కూడా వీటిరాక కారణంగానే వచ్చిందేమోననే అనుభూతిని వ్యక్తం చేస్తూ, వాటి ఉనికిని శుభకరంగా భావిస్తుంటారు. మృత్యు పాశాలవుతున్న విద్యుత్ తీగలు పుణ్యక్షేత్రం వాసులు తమ ఆడపడుచుల్లా చూసుకునే ఈ సైబీరియన్ పక్షులు మాయమవడానికి ఊరచెరువు పై నుంచి వెళ్లిన హైటెన్షన్ విద్యుత్ తీగలు కారణమని కొంతమంది అంటుంటే, కాదు ఈ మధ్య భారీగా బాణసంచా కాల్చడంతోనే భయపడి వెళ్లిపోయాయని మరికొందరంటున్నారు. ఏది ఏమైనా అవి స్వేచ్ఛగా విహరించేందుకు అనువైన వాతావరణం ఇక్కడ క్రమేణా కనుమరుగైపోతోందనేది వాస్తవం. ఎందుకంటే అవి విహరించే ఊర చెరువు చుట్టూ కంచి చెట్లు ఉన్నాగాని వాటి పై నుంచి వెళ్లిన హైటెన్షన్ విద్యుత్ తీగలు వాటి పాలిట మృత్యు గీతాలను ఆలపిస్తున్నాయి. వాటి పాలిట మృత్యపాశాలైన హైటెన్షన్ విద్యుత్ తీగలు పక్షులు గాలిలోకి ఎగిరే సమయంలో ఆ తీగలకు తగులుకొని చాలావరకు చనిపోతున్నాయి. చెరువు పై నుండి హైటెన్షన్ వైర్లను వేయవద్దని స్థానికులు అడ్డుపెట్టిన విద్యుత్ అధికారులు వినలేదు. ఏటా వచ్చే ఈ విదేశీ విహంగాలకు ఈ విద్యుత్ తీగలు మృత్యు ద్వారాలవుతున్నాయి. భవిష్యత్తులోనైనా ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపి ఈ పక్షుల మనుగడకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. జిల్లాలో సైబీరియన్ పక్షుల రాకతో విశిష్టతను సంతరించుకున్న పుణ్యక్షేత్రంలో నేడు వాటి జాడ కానరావడం లేదు. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా తొలకరి జల్లులు కురిసే సమయంలో ఇక్కడకు వచ్చిన విదేశీ విహంగాలు మూడు నెలలు కూడా తిరక్కుండానే ఒక్కసారిగా ఎటో ఎగిరిపోయాయి. సాధారణంగా ఏటా కార్తికమాసం వెళ్లిన తరువాత సంతానోత్పత్తితో రెట్టింపు సంఖ్యలో స్వస్థలాలకు వెళ్లే ఈ పక్షులు, ఏమైందో ఏమోగాని అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఈ విధంగా పక్షులు దూరం కావడంతో ఆరోజ నుంచి తమకు ఆరోగ్యపరంగా కూడా సమస్యలు వస్తున్నాయని కొంతమంది గ్రామస్తులు సెంటిమెంటుగా అంటున్నారు. అటవీ శాఖ పట్టించుకోవడం లేదు అటవీ శాఖ మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది. విదేశీ విహాంగాల కోసం ఒక బోర్డును ఏర్పాటుచేసి, అంతటితో తమ పని అయిపోయినట్టుగా ఆ శాఖ అధికారులు ఉన్నారు. రక్షణ లేని స్థితిలో పక్షులు కూడా ఇక్కడ ఇమడలేకపోతున్నాయి. అందుకనే అకస్మాత్తుగా వెళ్లిపోయాయి. – పేపకాయల ఈశ్వరరావు బాణసంచా కాల్పులే కారణం గ్రామంలో ఒక సందర్భంలో భాగంగా భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. ఆ కాల్పులకు బెదిరిపోయిన పక్షులు ఇక తిరిగి రాలేదు. గతంలో కూడా ఈ విధంగా ఒకసారి జరిగింది. మళ్లీ వచ్చే ఏడాది వరకు వాటి జాడ కనపడదు. – కర్రి వీరబాబు కరెంటు తీగలకు చనిపోతున్నాయి కరెంటు తీగల వల్ల వెళ్లిపోయాయి అనుకుంటున్నాం. పైకి ఎగిరేటప్పుడు కొన్ని చనిపోతున్నాయి. ఈ తీగలను మార్చమని ఎన్నిమార్లు చెప్పినా ఎవరు వినవడం లేదు. – ఈలి శ్రీను అపురూపంగా చూసుకున్నాం ఈ పక్షుల్ని మా ఊర్లో ఎవరినీ కొట్టనివ్వరు, ఎంతో అపురూపంగా చూసుకుంటాం, అయితే ఇప్పుడు ఉన్నఫలంగా ఎందుకు వెళ్లిపోయాయో తెలీడం లేదు. – నరాల రాము -
విహంగ విహారం!
ఏసిరెడ్డి రంగారెడ్డి : భాగ్యనగరానికి కొత్త అతిథులొస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి అలుపుసొలుపు లేకుండా ప్రయాణం చేసి నగరానికి చేరుకుంటున్నాయి. నగర శివారు ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలు, జలాశయాలు మొదలైన ప్రాంతాల్లో ప్రశాంతంగా సేదదీరుతున్నాయి. ఇంతకీ ఎవరీ అతిథులు అనుకుంటున్నారా..? ఏటా శీతాకాలంలో మనదేశానికి వలస వచ్చే సైబీరియన్ కొంగలు.. ఆఫ్రికా డేగలు.. రాజహంసలు.. మచ్చల బాతులు.. గోరింకలు ఇలాంటి వలస పక్షులే ఇవి. రాజధాని నగరానికి చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు, జలాశయాలు ఈ వలస విహంగాలకు ఆలవాలంగా మారుతున్నాయి. ఏటా అక్టోబర్–ఫిబ్రవరి మధ్యకాలంలో కనువిందు చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 200 జాతులు, ప్రజాతులకు చెందిన పక్షులు ఇక్కడకు చేరుకోవడం గమనార్హం. అయితే ఈ సంవత్సరం వీటి సంఖ్య 30–40 శాతం తగ్గుముఖం పట్టినట్లు జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుదూర తీరాల నుంచి.. సైబీరియా, యూరప్, ఆఫ్రికా, మయన్మార్, అప్గానిస్తాన్, పాకిస్తాన్ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరంతోపాటు.. సిటీకి ఆనుకుని ఉన్న పలు పర్యాటక ప్రాంతాలు, జలాశయాలకు ఏటా అక్టోబర్–ఫిబ్రవరి మధ్య కాలంలో సుమారు 200 జాతులు, ప్రజాతులకు చెందిన రెండు లక్షల పక్షుల వరకూ వలస రావడం పరిపాటే. గ్రేటర్‌తోపాటు.. సిటీకి ఆనుకుని ఉన్న పలు జలాశయాలు, పర్యాటక ప్రాంతాలు ఈ వలస పక్షులను అక్కున చేర్చుకుని వాటికి ఆహారం.. వసతి సమకూరుస్తున్నాయి. ప్రధానంగా కేబీఆర్ పార్క్.. అనంతగిరి హిల్స్.. ఫాక్స్‌సాగర్(జీడిమెట్ల).. అమీన్పూర్ చెర్వు.. హిమాయత్‌సాగర్.. ఉస్మాన్‌సాగర్.. మంజీరా జలాశయాలకు ఇవి తరలివస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 200 జాతులకు చెందిన 70 శాతం పక్షులు ఇక్కడకు చేరుకోవడం విశేషం. ఆ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు ఈ వలస పక్షులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వలస వచ్చే ప్రధాన పక్షి జాతులివే.. ప్రధానంగా కొంగలు, బాతులు, డేగలు, గుడ్లగూబలు, నీటి కోళ్లు తదితర జాతులు, ప్రజాతులకు చెందిన విభిన్న రకాల పక్షులు వలస వస్తుంటాయి. ఇందులో గుజరాత్ రాజహంసలు(గ్రేటర్ ఫ్లెమింగోలు), ఎర్రకాళ్ల కొంగలు, గూడబాతులు, రివర్టెర్న్, పిన్‌టెయిల్డ్ డక్, షౌలర్, గార్గినే టేల్, హ్యారియర్స్ డేగలు, ఫ్లైక్యాచెస్, గోరింక ప్రజాతికి చెందిన రోజీపాస్టర్స్, స్టార్‌లింక్స్ పక్షులు, బార్మెడోగూస్ బాతు, పైడ్ క్రస్టడ్ కకూ మొదలైనవి ప్రధానమైనవి. తగ్గుతున్న వలస పక్షుల సంఖ్య.. సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చే రాజహంసలు, మచ్చల బాతులు, ఎర్రకాళ్ల కొంగలు, గోరింకలు, డేగలు తదితర పక్షుల జాడ ఏటేటా తగ్గుముఖం పడుతోంది. ఈ ఏడాది వీటి సంఖ్య 30–40 శాతం తగ్గుముఖం పట్టాయి. ఇటీవలి కాలంలో వీటి సహజ ఆవాసాలైన ఆయా జలాశయాలు, చెరువులు, కుంటలు కాలుష్య కాసారాలుగా మారడం, గుర్రపుడెక్క పేరుకుపోవడం, కబ్జాలకు గురవ్వడం, నగరీకరణ ప్రభావం, పర్యాటక, మానవ కార్యకలాపాలు పెరగడం, వాతావరణ, శబ్ద, వాయు కాలుష్యం మొదలైనవి వలస పక్షుల పాలిట శాపంగా మారుతోంది. ఏటా ఈ సమయానికి హిమాయత్‌సాగర్‌కు సుమారు 200 వరకు గుజరాత్ రాజహంసలు వలస వస్తాయి. ఈసారి వీటి సంఖ్య 50కి మించలేదని జంతు ప్రేమికులు చెబుతున్నారు. విభిన్న రకాల గోరింక ప్రజాతులదీ ఇదే పరిస్థితి. ఇక ఆఫ్రికా ఖండం నుంచి ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే బార్‌హెడ్ గూస్(బాతు) జాడ కూడా ఈసారి కనిపించడం లేదు. ఆఫ్రికా నుంచే వలస వచ్చే డేగ ప్రజాతికి చెందిన పైడ్ క్రస్టెడ్ కకూ అనే పక్షి జాడ కూడా లేదు. వలసలకు ప్రధాన కారణాలివే.. ఆయా దేశాల్లో అధిక ఉష్ణోగ్రతలు, శీతల వాతావరణం, మంచు ప్రభావం వల్ల ఆహారం, వసతి కష్టతరంగా మారడం తదితర కారణాలతో వేలాది కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి పక్షులు వలస వస్తుంటాయి. పక్షులు వలస వచ్చే మన పర్యాటక ప్రాంతాల్లో సమశీతోష్ణ వాతావరణం ఉండటం, ఈ ప్రాంతంలో ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గి నీటిలో వృక్ష, జంతు ప్లవకాలు, చిన్న కీటకాలు వీటికి ఆహారంగా లభ్యమవుతున్నాయి. వీటిలో పక్షులకు అవసరమైన పోషక విలువలు మెండుగా ఉంటాయి. ఈ కారణాల రీత్యా పక్షులు వలస వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నగరీకరణ, కాలుష్యమే ప్రధాన కారణం నగరీకరణ ప్రభావం, వాతావరణ, శబ్ద, వాయు కాలుష్యాలే వలస పక్షుల పాలిటశాపంగా మారుతున్నాయి. రెండేళ్లుగా అమీన్పూర్ చెర్వు, ఇక్రిశాట్, మంజీరా జలాశయాల వద్ద వలస పక్షుల మనుగడను పరిరక్షించేందుకు పలు చర్యలు చేపట్టడం సంతోషకరం. ఇదే స్ఫూర్తితో ఇతర ప్రాంతాల్లోనూ వలస పక్షులకు ఆహారం, వసతి లభ్యమయ్యేలా చూడాలి. – డాక్టర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, జంతుశాస్త్ర విభాగం, ఓయూ వలస పక్షులకు నిలయాలు ఈ ప్రాంతాలు.. ప్రాంతం వలస పక్షుల జాతులు కేబీఆర్ పార్క్ 24 అనంతగిరి హిల్స్ 37 ఫాక్స్‌సాగర్(జీడిమెట్ల) 38 అమీన్పూర్ చెరువు 42 హిమాయత్‌సాగర్ 52 ఉస్మాన్‌సాగర్ 99 మంజీరా 153 వివిధ దేశాల నుంచి పక్షులు వలస వచ్చే దూరం దేశం కిలోమీటర్లు ఆఫ్రికా 5,637 సైబీరియా 5,118 యూరప్ 6,721 మయన్మార్ 3,497 అప్గానిస్తాన్ 2,130 పాకిస్తాన్ 1,715 గుజరాత్ 1,377 వలస పక్షులను అక్కున చేర్చుకోవాలంటే.. ♦ సహజసిద్ధమైన జలాశయాలు, చెరువులు, కుంటలు కాలుష్యకాసారం కాకుండా కాపాడుకోవాలి. ♦ గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఆయా జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా చూడాలి. ♦ ఆయా జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలి. జలాశయాలు కబ్జాల పాలు కాకుండా చూడాలి. ♦ మానవ, పర్యాటక కార్యకలాపాలను పక్షులు నివాసం ఉండే ప్రాంతాలకు చాలా దూరంలోనే పరిమితం చేయాలి. ♦ శబ్దకాలుష్యం పెరగకుండా చూడాలి. చైనీస్ మాంజాను నిషేధించాలి. ఈ ప్రాంతాల్లో పక్షులు మాయం పదేళ్ల క్రితం హుస్సేన్‌సాగర్‌కు విభిన్న రకాల బాతులు, వాటి ప్రజాతులకు చెందిన పక్షులు వలస వచ్చేవి. ఇప్పుడు ఈ జలాశయం కాలుష్య కాసారం కావడంతో వలస పక్షుల జాడ కనుమరుగైంది. ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, కాప్రా, రామకృష్ణాపూర్, బోయిన్పల్లి చెరువులదీ ఇదే దుస్థితి. ఆయా జలాశయాల్లోకి సమీప గృహ, వాణిజ్య, పారిశ్రామికవాడల నుంచి కాలుష్య, మురుగు నీరు చేరి యుట్రిఫికేషన్ చర్య జరుగుతోంది. దీంతో జలాశయాల ఉపరితలంలో గుర్రపుడెక్క మందంగా పరుచుకుంటుంది. దీంతో పక్షి జాతులకు ఆహార సేకరణ కష్టతరమై.. వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. -
చూసొద్దాం...
సైబీరియాకు చెందిన ఎర్రకాళ్ల కొంగలు ప్రతి ఏటా క్రమం తప్పకుండా సంతానోత్పత్తికి చిలమత్తూరు మండలం వీరాపురానికి వస్తుంటాయి. ఈ ఏడాది కూడా ఆలస్యంగానైనా వందల సంఖ్యలో కొంగలు వచ్చాయి. అరుదైన ఈ కొంగల సందడి చూడాలనుకుంటే జిల్లా కేంద్రం నుంచి 124 కిటోమీటర్ల దూరం ప్రయాణించి కొడికొండ చెక్‌పోస్టు మీదుగా వీరాపురం చేరుకోవచ్చు. హిందూపురం నుంచి వచ్చే సందర్శకులు లేపాక్షి ఆలయాన్ని చూసుకుని అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చిలమత్తూరు మీదుగా వీరాపురం వెళ్లవచ్చు. అంతేకాక వీరాపురం నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఎల్లోడు గ్రామ సమీపంలో ఆదినారాయణ కొండ స్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. ప్రకృతి రమణీయత ఒడిలో ఈ ఆలయం సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు. - చిలమత్తూరు (హిందూపురం) -
అతిథులొచ్చారు..
చిలమత్తూరు : మండలం వీరాపురానికి సైబీరియన్ కొంగల రాక ఆలస్యంగా మొదలైంది. సాధారణంగా ఈ ఎర్రకాళ్ల కొంగలు డిసెంబర్, జనవరి నెలల్లో సైబీరియా నుంచి సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వచ్చేవి. తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది వీటి రాక ఆలస్యమైంది. శుక్ర, శనివారాల్లో దాదాపు 30 పక్షులు వీరాపురానికి చేరాయి. అయితే.. పరిసర ప్రాంతంలోని ఏ చెరువులోనూ చుక్క నీరు లేదు. దీంతో ఇవి ఇక్కడ విడిది చేస్తాయా, తిరిగి వెళ్తాయా అనేది వేచిచూడాలి. -
ఏం చక్కటి వయ్యారం!
సైబీరియన్ పక్షులతో గోపవరం మండలం బేతాయపల్లి చెరువు కళకళలాడుతోంది. ఇక్కడికి సమీపంలోనే సోమశిల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉండటంతో ఈ ఏడాది పెద్ద సంఖ్యలో పక్షులు వచ్చాయి. చిన్న చిన్న కట్టె పల్లలను ఏరుకొచ్చి చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. గుడ్లు పెట్టి.. పిల్లలను పొదిగి.. వాటికి రెక్కలొచ్చే వరకు ఈ పక్షులు ఇక్కడే ఉంటాయి. అనంతరం స్వస్థాలానికి పిల్లలతో కలిసి ఎగిరిపోతాయి. సైబీరియన్ పక్షుల సందడి పెద్ద ముక్కు... పొడవాటి కాళ్లు.. విశాలమైన రెక్కలు.. చూసేందుకు భలేగున్నాయి కదూ.. ఇవి సైబీరియన్ పక్షులు. మన జిల్లాకు అతిథులుగా వచ్చాయి. గోపవరం మండలం బేతాయిపల్లెలోని చెట్లపై గూళ్లు కట్టుకున్నాయి. జనవరి చివరిలో వచ్చిన ఈ విహంగాలు ఇక్కడే గుడ్లుపెట్టి.. పిల్లలను పొదిగి అవి కాస్త ఎగిరే దశకు చేరాక తిరిగి తమ ప్రాంతానికి రివ్వున ఎగిరిపోతాయి. సోమశిల బ్యాక్‌వాటర్‌లో చేపలను ఆరగిస్తూ.. సాయంత్రానికి గూటికి చేరుకుంటాయి. - ఫొటోలు: రమేష్ -
సైబీరియా పక్షుల రాకతో కొత్త కళ