అతిథులొచ్చారు..
చిలమత్తూరు : మండలం వీరాపురానికి సైబీరియన్ కొంగల రాక ఆలస్యంగా మొదలైంది. సాధారణంగా ఈ ఎర్రకాళ్ల కొంగలు డిసెంబర్, జనవరి నెలల్లో సైబీరియా నుంచి సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వచ్చేవి. తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది వీటి రాక ఆలస్యమైంది. శుక్ర, శనివారాల్లో దాదాపు 30 పక్షులు వీరాపురానికి చేరాయి. అయితే.. పరిసర ప్రాంతంలోని ఏ చెరువులోనూ చుక్క నీరు లేదు. దీంతో ఇవి ఇక్కడ విడిది చేస్తాయా, తిరిగి వెళ్తాయా అనేది వేచిచూడాలి.