Kadem Project Danger Zone Due To Heavy Rains Flood Water Latest News Updates - Sakshi
Sakshi News home page

Kadem Project Flood Water Video: మళ్లీ కడెం టెన్షన్‌.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కు

Published Thu, Jul 27 2023 10:19 AM | Last Updated on Thu, Jul 27 2023 10:56 AM

Kadem Project Floods Danger Zone Updates - Sakshi

సాక్షి, నిర్మల్: కడెం ప్రాజెక్ట్ మరోసారి వణుకు పుట్టించింది. నాలుగు గేట్లు తెరుచుకోకుండా మొరాయించడంతో..  ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడిపాయి. ఈ క్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి అక్కడి పరిస్థితిని పర్యక్షించారు. కాసేపటికి వరద తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో.. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి (700 అడుగులు) చేరుకుంది.  ఎగువ నుంచి ప్రాజెక్ట్‌లోకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. 14 వరద గేట్ల ద్వారా 2.4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో.. కడెం ప్రాజెక్టుకు మొత్తంగా 18 వరద గేట్లు ఉండగా,  నాలుగు గేట్లు తెరుచుకుకోకుండా ఇంకా మొరాయించాయి.  జ‌ర్మ‌న్ క్ర‌స్ట్ గేట్లపై నుంచి వ‌ర‌ద‌నీరు పారింది. 

ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను సంబంధిత అధికారులు అప్రమత్తం చేశారు.  ఇప్పటికే 12 గ్రామాలకు చెందిన 7 వేల మందిని పునరావాస కేంద్రాల‌కు త‌ర‌లింపు ఇక కడెం ప్రాజెక్ట్ కు చేరుకోని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు.  ఈ క్రమంలో అంతా వరదకు భయపడి ఒకసారి వెనక్కి వెళ్లారు.

అయితే.. వరద తగ్గితే కట్ట మైసమ్మ మొక్కు చెల్లించుకుంటానంటూ కడెం వద్ద మొక్కు‌కున్నారు మంత్రి. ఆపై కాసేపటికే కడెం వరద తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

కడెం సామర్థ్యం : 8.227/7.60 TMC.

ఇన్ ఫ్లో 230138 c/s 

అవుట్ ఫ్లో 236032c/s

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement