
పనులను ప్రారంభిస్తున్న మంత్రి ఐకేరెడ్డి
నిర్మల్‌టౌన్ : నందిగుండం ఆలయ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని విశ్వనాథ్‌పేట్‌లోని నందిగుండం దుర్గామాత ఆలయ అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.50 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు.
మున్ముందు సహకారం అందేలా చూస్తాననన్నారు. దసరా వరకు అభివృద్ధి పనులు పూర్తవుతాయని తెలిపారు. అనంతరం మంత్రికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జ్ఞాపికను బహూకరించారు. ఇందులో ఆలయ కమిటీ అధ్యక్షడు లక్కడి జగన్మోహన్‌రెడ్డి, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండాజీ వెంకటాచారి, ఆలయ ధర్మకర్త ముత్యం సంతోష్‌గుప్త, కొరిపెల్లి దేవేందర్‌రెడ్డి, దేవరకోట చైర్మన్ ఆమెడ కిషన్, బీజేపీ నాయకుడు రావుల రాంనాథ్ తదితరులు ఉన్నారు.