temple development
-
ఈనెల 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 14న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యాదాద్రి ఆలయ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి ఆదివారం కొండగట్టుకు వెళ్లనున్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించిననున్నారు ఆనంద్ సాయి. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను జగిత్యాల ఎస్పీ భాస్కర్ పరిశీలించారు. కాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. దేవాలయ అభివృద్ధికోసం ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద ఈ నిధులను మంజూరు చేస్తూ ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె, రామకృష్ణా రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు విడుదల చేస్తామని గత డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వగా.. ఈ మేరకు నిధులు విడుదల చేశారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ కేసు: మరోసారి తెరమీదకు ఎమ్మెల్సీ కవిత పేరు -
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా! శ్రీ యాదగిరి నారసింహా!
యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలోని విభాండక ఋషి. అతడి పుత్రుడైన ఋష్యశృంగుడి కుమారుడు యాదరుషి. అతణ్ణే యాదర్షి అంటారు. చిన్నప్పట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆ స్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుణ్ణి అన్వేషించడానికి అడవులూ, కొండలూ కోనలూ తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న యాదర్షి ఒకరోజు ఇప్పుడున్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక రావిచెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు కలలో ఆంజనేయస్వామి కనిపించి ‘నీ పట్టుదల నాకు నచ్చింది. నీకు తోడుగా నేనుంటాను. కఠోరమైన తపస్సు చేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడు’ అని చెప్పారట. నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఉగ్రనారసింహుడు ప్రత్యక్షమయ్యారట. ఆ తేజస్సును చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని కోరాడట యాదర్షి. అప్పుడు లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చి ‘‘ఏం కావాలో కోరుకో’’ అని అడిగితే, ‘‘నీ దర్శనం కోసం ఇంత ఘోర తపస్సు సామాన్యులు చేయలేరు. అందుకే నువ్వు శాంత రూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపో’’ అని కోరాడట. అప్పుడు కొండశిలమీద స్వామి ఆవిర్భవించాడు. కొన్నాళ్ల తరువాత యాదర్షికి మరో కోరిక కలిగింది. స్వామిని ఒకే రూపంలో చూశాను. వేర్వేరు రూపాల్లో చూడలేకపోయానే అనుకుని మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు స్వామి మళ్లీ ప్రత్య„ý మయ్యాడు. యాదర్షి కోరిక విని, ‘‘నా రూపాలన్నీ నువ్వు చూడలేవు’ అయినా నీకోసం మూడు రూపాలు చూపిస్తాను’’ అని జ్వాలా, యోగానంద, గండభేరుండ నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడట జ్వాలా నారసింహుడు సర్పరూపంలో ఉంటాడు. యోగానందుడు అర్చా విగ్రహరూపంలో ఉంటాడు. గండభేరుండ నారసింహుడు కొండ బిలంలో కొలువై ఉంటాడు. తరువాత యాదర్షి... తనను స్వామిలో ఐక్యం చేసుకోమని కోరడంతో అలాగే చేసుకున్నాడట స్వామి. ఆ యాదర్షి పేరుమీదనే ఇది యాదగిరిగుట్ట అయింది. స్వాగత తోరణం.. యాదాద్రి కొండపైన భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల తిరుపతి తరహాలో ఈ ఆర్చీ ఉంటుంది. ఇక వైపు కొండ ఎక్కడానికి, మరో వైపు కొండ దిగేందుకు ఈ ఆర్చీని నిర్మాణం చేశారు. ఈ ఆర్చీ పైభాగంలో శంకు, చక్ర, నామాలు, శ్రీలక్ష్మీనరసింహస్వామి రూపాలను తీర్చిదిద్దారు. ఆలయ విశిష్ఠత గర్భగుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరి కాస్త లోపలయోగముద్రలో యోగానందస్వామి, లక్ష్మీనరసింహ స్వాములను దర్శించుకోవచ్చు. గర్భాలయం నుంచి బయటకు వస్తే మెట్లకు ఎడమపక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి కింద గల పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిపిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక బయట ఎడమవైపున మెట్లు దిగితే పుష్కరిణి. కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుని ఆలయం అగుపిస్తాయి. ఆలయమంతా స్వర్ణమయం గర్భాలయంపైన దివ్య విమాన గోపురానికి భక్తులు విరాళంగా ఇచ్చిన 125 కిలోల బంగారంతో తాపడం చేయిస్తున్నారు. పంచనారసింహులు కొలువైన గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం చేసిన కవచాలను బిగించారు. ఆళ్వార్ మండపంలో 35 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభానికి సైతం బంగారు తొడుగులను ఇటీవలనే పూర్తి చేశారు. త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలకు పసిడి కలశాలు బిగించారు. వీటితోపాటు ఉప ఆలయాల ద్వారాలకు వెండి, ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లో ద్వారాలకు ఇత్తడి తొడుగులు, అష్టభుజి ప్రాకార మండప శిఖరాలపై రాగి కలశాలు బిగించారు. బంగారు తొడుగుల పనులన్నీ చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థలో చేయించారు. శివాలయం... యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైనే ఉన్న అనుబంధ ఆలయంగా శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి దేవాలయం కొనసాగుతోంది. శివాలయంలో ప్రధాన ఆలయం, ముఖ మండపం, ప్రకార మండపం, త్రితల రాజగోపురం నిర్మించారు. ప్రధాన ఆలయంంలోని మండపాల్లో, నాలుగు దిశల్లో కృష్ణ శిలతో స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేశారు. ప్రధాన ఆలయం ముందు భారీ నందీశ్వరుడి విగ్రహాన్ని పెట్టారు. ఆలయానికి ఉత్తర దిశలో శ్రీస్వామి వారి కల్యాణ మండపం, ఆ పక్కనే రథశాల నిర్మించారు. ఆలయ ఉద్ఘాటన నాటికి ఆలయంలో స్ఫటిక లింగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 25న శివాలయంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. విష్ణు పుష్కరిణి... కొండపైన విష్ణు పుష్కరిణిని అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. గతంలో ఈ పుష్కరిణిలో భక్తులు స్నానాలు చేసే వారు. కానీ ఇప్పుడు విష్ణు పుష్కరిణిలో శ్రీస్వామి వారికి మాత్రమే ఉపయోగించనున్నారు. గిరి ప్రదక్షిణ... శ్రీస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. వీరితో పాటు మండల దీక్ష చేసే భక్తులు సైతం ప్రతి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరి ప్రదక్షిణను ఆలయ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. పుష్కరిణిలో భక్తుల స్నానాలు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం గండి చెరువు సమీపంలో నిర్మించిన లక్ష్మీ పుష్కరిణి లో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. ప్రధానాలయం ఉద్ఘాటన సందర్భంగా పలువురు భక్తులు బాలాలయం లో శ్రీస్వామి వారిని కొండపైన దర్శనం చేసుకొని, అనంతరం కొండ కింద జరుగుతున్న నిర్మాణాలను తిలకించారు. ఈ సమయంలో లక్ష్మీ పుష్కరిణిలోకి వెళ్లి స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. కల్యాణ కట్ట ప్రారంభం.. ఆధునిక హంగులతో నిర్మాణం చేసిన కల్యాణ కట్టను ఈవో గీతారెడ్డి ఆదివారం ప్రారంభించారు. 28వ తేదీ నుంచి ప్రధానాలయంలో స్వయంభూల దర్శనం కలగనున్న నేపథ్యంలో భక్తులు అధికంగా క్షేత్రానికి వచ్చే అవకాశం ఉంది, ఇందులో భాగంగానే ముందస్తుగా కల్యాణ కట్టలో పూజలు చేసి ప్రారంభించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా ఈ కల్యాణ కట్టలోనే తలనీలాలను సమర్పించుకోనున్నారు. స్వామి పుష్కరిణి ఈ క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణికి ఓ ప్రత్యేకత ఉంది. దీనినే ‘విష్ణుకుండం’ అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది. ఈ తీర్థం చాలా మహిమాన్వితమైనదని పేరు. భక్తుల రాక యేటేటా పెరగడంతో ఈ క్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ వాస్తవ్యుడైన రాజామోతీలాల్ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి వైభవం విని స్వామి వారిని దర్శించి స్వామి వారికి ఆలయనిర్మాణం చేయించాడు. ప్రాకారం, గోపుర ద్వారం, ముఖమండపం నిర్మించాడు. ఆ తర్వాత భక్తులు తమ యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ క్షేత్ర యాజమాన్యం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. యాదగిరి లక్ష్మీనరసింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతోంది. వైకుంఠద్వారం... యాదాద్రి కొండపైకి నడకదారిన వెళ్లే భక్తులు ఈ వైకుంఠ ద్వారం నుంచి వెళ్లాలి. ఈ వైకుంఠద్వారాన్ని యాలీ పిల్లర్ల మీద ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వారం వద్ద భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మెట్లదారి నుంచి శ్రీస్వామి వారి క్షేత్రానికి వెళ్లవచ్చు. అన్నప్రసాదం... గండి చెరువుకు కొద్ది దూరంలో క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం కోసం అన్నసత్ర భవనాన్ని 2.7 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు యాదాద్రి దేవాలయ అభివృద్ధి సంస్థ రూ.6కోట్లు ఖర్చు చేస్తుండగా.. రూ.11కోట్లను వేగేశ్న సంస్థ ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఈ మండపం స్లాబ్ లెవల్ పనులు పూర్తయ్యాయి. కల్యాణ కట్ట... శ్రీస్వామి వారికి భక్తులు సమర్పించుకునే తలనీలాల కోసం అధునాతన హంగులతో కల్యాణ కట్టను నిర్మించారు. దీనిని 2.23 ఎకరాల విస్తీర్ణంలో రూ.20.3కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు. ఇందులో ఒకేసారి 360 మంది పురుషులు, 160 మంది మహిళ భక్తులు తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. దీక్షాపరుల మండపం శ్రీస్వామి క్షేత్రంలో మండల దీక్ష చేసే భక్తులకు దీక్షాపరుల మండపాన్ని అధునాతనంగా నిర్మించారు. 1.88 ఎకరాల స్థలంలో రూ.8.09 కోట్ల వ్యయంతో ఈ దీక్షారుల మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 140 మంది పురుషులు, 108 మంది మహిళ భక్తులు దీక్షలు చేసే సమయంలో బస చేసేలా ఏర్పాట్లు చేశారు. గండి చెరువు... శ్రీస్వామి వారి తెప్పోత్సవం కోసం గండి చెరువును వైటీడీఏ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చారు. ఇందులో శ్రీస్వామి వారి తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా భక్తులు సేద తీరేందుకు లాన్స్, గ్రీనరీ, బేంచీలను ఏర్పాటు చేసి, బోటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఫలితాలనొసగే ‘ప్రదక్షిణల మొక్కు’ ఈ క్షేత్రంలో ప్రదక్షిణల మొక్కు’ ప్రధానమైనది. దీనివల్ల మానసిక, శారీరక, ఆర్థికబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండలం (41 రోజులు), అర్ధమండలం, 11 రోజుల ప్రదక్షిణల మొక్కులు మొక్కుకుంటారు భక్తులు. నిత్యం గర్భాలయానికి రెండుసార్లూ, ఆంజనేయస్వామికి 16 సార్లూ ప్రదక్షిణలు చేస్తారు.ఈ మొక్కు తీర్చుకునే దశలో స్వామి కలలోనే తమకు చికిత్సలు చేసి, శారీరక బాధల నుంచి విముక్తి చేస్తారని నమ్ముతారు. యాగ స్థలం... యాదాద్రి కొండకు దిగువన 93 ఎకరాల్లో యాగ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గతంలో 1,008 కుండాలతో మహా సుదర్శన యాగం చేయాలని అధికారులు భావించారు. కానీ అనివార్య కారణాలతో ఈ యాగం వాయిదా పడింది. ఇప్పుడు ఇందులో భక్తుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారు. లక్ష్మీపుష్కరిణి... కల్యాణకట్టకు ఎదురుగానే భక్తుల కోసం లక్ష్మీ పుష్కరిణిని ఆధ్యాత్మిక హంగులతో అద్భుతం గా నిర్మించారు. 2.13 ఎకరాల్లో రూ.6.67కోట్ల వ్యయంతో ఈ లక్ష్మీ పుష్కరిణి రూపుదిద్దుకుంది. ఇందులో ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లను నింపుతున్నారు. త్వరలోనే గోదావరి జలాలను సైతం నింపనున్నారు. ఈ పుష్కరిణిలో 1,500 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ఏర్పాట్లు చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. వ్రత మండపం... అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి క్షేత్రం తరువాత యాదాద్రీశుడి ఆలయంలోనే భక్తులు అధిక సంఖ్యలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను జరిపిస్తారు. ఇందుకోసం నిర్మిస్తున్న వ్రత మండపం ఇది. లడ్డూ ప్రసాదం.. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా లడ్డూ, పులిహోరకే మక్కువ చూపెడతారు. ఇందుకు వైటీడీఏ అధికారులు అధునాతన హంగులతో మానవ ప్రమేయం లేకుండా మిషన్ల ద్వారా ప్రసాదం తయారీ చేసే విధంగా ఏర్పాటు చేశారు. క్షేత్రానికి ఎంత మంది వస్తే అంత మందికి లడ్డూ, పులిహోర, ఇతర ప్రసాదం తయారీ చేసి ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఇందులో ప్రత్యేక కౌంటర్లు, లైన్లు ఏర్పాటు చేశారు. పూర్వ జన్మ సుకృతం ‘‘యాదాద్రి నరసింహుని ఆలయ పునర్నిర్మాణం కోసమే భగవంతుడు నన్ను భూమి మీదికి పంపించి ఉంటాడు. అందుకోసమే భక్తులకు కావాల్సిన రీతిలో క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకోగలిగాను. యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి రూపొందించిన ప్లాన్ ప్రకారం పని చేయడానికి నన్ను పిలిపించారు. ప్రధాన స్థపతి సుందర రాజన్ ద్వారా ఆలయ ప్లాన్‌ను ఆమోదించారు. ఆ క్రమంలో నన్ను అదనపు స్థపతి, సలహాదారుగా నియమించారు. స్వామివారి ప్రధానాలయం, శివాలయం కార్యనిర్వహణ పనిని అప్పగించారు. స్థపతులు, శిల్పులు, టీటీడీ శిల్ప కళాశాల విద్యార్థులు... ఇలా అందరి భాగస్వామ్యంతో నాకప్పగించిన పనులు పూర్తి చేశాను. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి నిమిషం ప్రతి మనిషి పక్కన స్వామి వారే ఉండి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఇది ఏ ఒక్కరి వల్లా పూర్తి కాలేదు. స్వామివారి ఆజ్ఞగానే భావించి అందరూ ఇందులో పాలు పంచుకున్నారు. సర్వేజనాస్సుఖినోభవంతు అన్న విధంగా స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉంటాయి. దేవాదాయ ధర్మాదాయ స్థపతి సలహాదారుగా ఎన్నో ఆలయాలు నిర్మించిన నేను.. యాదాద్రి క్షేత్ర నిర్మాణంలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుకృతం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. స్వామివారికి సహస్రాధిక నమస్సులు తెలియజేసుకుంటున్నాను’’. – స్థపతి డాక్టర్ ఆనందాచారి వేలు మహాద్భుత క్షేత్రంగా యాదాద్రి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఎంతో అద్భుతంగా జరిగింది.దేశంలోనే మహాద్భుత క్షేత్రంగా విలసిల్లుతుంది. ఈ మహాక్రతువులో నేను కూడా భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని నభూతో న భవిష్యతి అన్న రీతిలో పూర్తి కావించారు. యావత్ భక్త ప్రపంచం ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మహా ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. నేటి ఉదయం నిత్యకైంకర్యం గావించగానే బాలాలయంలో నిత్య పూర్ణాహుతి జరుగుతుంది. వెంటనే శ్రీస్వామి వారు మేళతాళాలు, స్వస్తి మంత్రాలు, వేద దివ్య ప్రబంధ పాశుర పఠనాలతో ప్రధానాలయంలోకి వేంచేస్తారు. అక్కడ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. 11.45 నిమిషాల నుంచి గోపురాలకు పూజలు నిర్వహించి, 11.55కు కుంభాభిషేకం ఏకకాలంలో జరిపిస్తాం. 92 స్థానాల్లో 200 మంది రుత్విక్కులు పాల్గొని ఏకకాలంలో అన్ని గోపురాలు, ప్రాకార మండపాలు, గర్భాలయం, ఆండాల్, ఆళ్వార్, రామానుజులు, విష్వక్సేన సన్నిధి, చతుర గోపురాలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ప్రధానాలయంలో మొదటి పూజ, మంత్రపుష్ప నీరాజనాలు, ప్రసాద వినియోగం పూర్తవుతాయి. తర్వాత సీఎం కేసీఆర్‌కు ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం సంధ్యాసమయానికి ద్వితీయ ఆరాధన పూర్తి కాగానే శాంతి కల్యాణం నిర్వహించి ఉత్సవాలకు వచ్చిన పండితులకు సన్మానం చేస్తాం. భక్తులకు శ్రీస్వామి వారి ఆశీర్వచనం ఉంటుంది. – నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ఆలయ ప్రధానార్చకులు కథనాలు: సాక్షి యాదాద్రి, యాదగిరి గుట్ట, ఫొటోలు: కొల్లోజు శివకుమార్, సాక్షి భువనగిరి -
ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: మంత్రి వెల్లంపల్లి
-
ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ల రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఆలయానికి ఆ ఆలయ సంప్రదాయాలు పాటిస్తూ.. భక్తులకు సౌకర్యాలు, అభివృద్ధి పనులు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ఉంటుంది. వచ్చే 40 ఏళ్ల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్‌కు రూపకల్పన చేయనున్నారు. తొలి దశలో దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాలతో సహా 25 దేవాలయాలకు మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నారు. వీటిలో మహానంది, కసాపురం, అహోబిలం, యెక్కంటి వంటి ఆలయాలు ఉన్నాయి. ఇందుకు ఉత్తర భారత దేశంలో, తమిళనాడులో పలు పురాతన, ప్రఖ్యాత ఆలయాలకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్లను రూపొందించిన రెండు ప్రముఖ అర్కిటెక్చర్ సంస్థలను దేవదాయ శాఖ ఎంప్యానల్ చేసింది. ఈ సంస్థల ప్రతినిధులతో వారం క్రితం దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్‌లు వీడియో సమావేశం నిర్వహించి, ఆలయాల వారీగా మాస్టర్ ప్లాన్ల రూపకల్పనపై చర్చించారు. ఆలయాల్లోని సంప్రదాయాలు, ప్రస్తుతం ఉన్న ప్రధాన గర్భాలయాల రూపం మారకుండా మాస్టర్ ప్లాన్లు ఉంటాయని దేవదాయశాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఆలయం ప్రాంగణంలో, చుట్టుప్రక్కల ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమమైనా మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేపడతారని చెప్పారు. సాయంత్రం వేళ ప్రాచీన సంప్రదాయ కళా ప్రదర్శనలు, ఇతర ఆరాధన కార్యక్రమాలకు వేదికల నిర్మాణం వంటి వాటికి ప్రాధన్యత ఉంటుందని తెలిపారు. ఇటీవలి కాలంలో కుటుంబ సమేతంగా కార్లలో ఆలయాలకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆలయం పరిసరాలను అవకాశం ఉన్న మేరకు విశాలమైన పార్కింగ్ ఏరియా, ఆహ్లదకరమైన పూల వనాలు వంటి వాటికి మాస్టర్ ప్లాన్‌లో చోటు కల్పిస్తామన్నారు. -
టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్‌పర్స్‌న్‌గా ప్రశాంతి ప్రమాణం
-
టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్ పర్సన్ గా ప్రశాంతి రెడ్డి ప్రమాణం..
న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీ సలహామండలికి చైర్‌పర్సన్‌గా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర భారతదేశంలో టీటీడీ ఆలయాల అభివృద్ధి దిశగా చర్యలు చేపడతామని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆలయ గర్భగుడిని అలాగే ఉంచి.. మిగిలిన ప్రాంతాన్ని పునర్నిర్మిస్తామని పేర్కొన్నారు. అయోధ్యలో టీటీడీ ఆలయంలో గానీ, భజన మండలి నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలోని 29 పీఠాధిపతులతో తిరుమలలో గోమహా సమ్మేళనం నిర్వహిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అన్నారు. దేశంలోని ఏ గుడిలో నైనా.. గోవును అడిగితే ఉచితంగా అందజేస్తామని తెలిపారు. దేశంలో అనేక చోట్ల గోవులకు సరైన పోషణ ఉండటం లేదని ఆవేదన సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. గోసంరక్షణ కోసం అవసరమైన నిధులను కూడా.. టీటీడీ కేటాయిస్తుందని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
‘చంద్రబాబు దేవాలయాలను కూలిస్తే మా ప్రభుత్వం నిర్మిస్తోంది’
-
‘చంద్రబాబు దేవాలయాలను కూలిస్తే మా ప్రభుత్వం నిర్మిస్తోంది’
అమరావతి: దేవాలయశాఖలో వినూత్న మార్పులు తెస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల భూములు కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్ నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టు, ట్రిబ్యునల్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులను నియమిస్తున్నట్లు తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి కూడా నాడు-నేడు విధానం రూపొందించామని మంత్రి వెల్లంపల్లి అన్నారు. అదే విధంగా ప్రతి దేవాలయంలోను గోశాలలను ఏర్పాటుచేస్తామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. చంద్రబాబు దేవాలయాలను కూలిస్తే.. మా ప్రభుత్వం నిర్మిస్తోందని పేర్కొన్నారు. త్వరలోనే 9 కొత్త దేవాలయాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రసాదం స్కీం ద్వారా ప్రముఖ దేవాలయాల అభివృద్ధి చేస్తున్నామని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
దేవాలయాలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం
సాక్షి,విజయనగరం: దేవాలయాల పరిరక్షణపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. '' దేవాలయాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. అన్యక్రాంతం అవుతున్న దేవాదాయశాఖ భూములను కాపాడుకునే దిశగా జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నాం. దేవాలయాలకు సంబందించిన కమర్షియల్ స్థలాలు అభివృద్ధి చేసి, ఆదాయాన్ని పెంచుకుంటాం. అనేక భూములు చంద్రబాబు దారాదత్తం చేశారు. ఆక్రమణలు జరగకుండా పరిరక్షణ కు చర్యలు చేపడుతున్నాం. 40 వేల సీసీ కెమారాలను ఆలయాల వద్ద అమర్చడం జరిగింది.విమర్శమకు తావివ్వకుండా టెంపుల్ వద్ద భద్రతపెంచి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నలభై టెంపుళ్లను చంద్రబాబు కూలిస్తే జగన్ పునఃనిర్మాణం చేసేందుకు పూనుకున్నారు'' అని తెలిపారు. దేవాలయాలపై సమీక్ష జరగడం ఇదే తొలిసారి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. '' దేవాలయాలపై సమీక్ష జరగడం ఇదే తొలిసారి. జిల్లాల వారీగా సమీక్ష చేసి వాస్తవ పరిస్థితులు తెలుకోవడం మంచిదే.. ఇందుకు అభినందిస్తున్నాను.. వంద ఇళ్లుల వద్ద ఒక ఆలయం నిర్మించాలనడం మంచి నిర్ణయం.. ఇందుకు పది లక్షలు ఇస్తుంది.. జగనన్న కాలనీలు నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ అన్ని వర్గాలు వారు ఉంటారు.. ఇవి పెద్ద గ్రామాలుగా మారనున్నాయి. జిల్లాలో వంద గ్రామాలలో నామ్స్ ప్రకారం గుడ్లుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నా. ఏసీ ఆఫీసు నిర్మాణం చేయాలని నిర్ణయించారు.. ఇందుకు మా సహకారం అందుతుంది.. సూపరింటెండెంట్ దగ్గర నుంచి డీసీ వరకు మీ పరిధిలో ఉన్న ఆస్తిపాస్తులు పై అవగాహన పెంచుకోవాలి. వేణు గోపాల స్వామి టెంపుల్ లో బంగారు ఆభరణాలు ఉన్నాయని ప్రజలే చెబుతున్నారు. అవి ఎన్నున్నాయి అని చూసుకోవాలి. ఇది ప్రజల సెంటిమెంట్ కావునా జాగ్రత్తగా ఉండాలి'' అని పేర్కొన్నారు. -
ఆలయాల అభివృద్ధి...భక్తులపైనే భారం
సాక్షి, హైదరాబాద్ : నిత్య పూజలు.. పండుగ ఉత్సవాలు.. బ్రహ్మోత్సవాలు, ఇతర వేడుకలు, నిర్వహణ పనులు, భక్తుల వసతికి అభివృద్ధి పనులు.. ప్రతి దేవాలయంలో భారీగా వ్యయం అవుతుంది. కానీ రాష్ట్రంలో కొన్ని దేవాలయాలకు మంచి ఆదాయం ఉండగా, మిగతా దేవాలయాలకు అంతంత మాత్రమే ఆదాయం ఉంది. సర్వశ్రేయోనిధి లాంటి వాటికి దేవాలయాల నుంచి నిర్ధారిత మొత్తం చెల్లించాల్సి ఉండగా, వాటికి మాత్రం ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులంటూ ఉండవు. భక్తుల నుంచి, ఇతర కైంకర్యాల రూపంలో వచ్చే కానుకలు, విరాళాలే ప్రధాన ఆదాయ వనరు. ఫలితంగా చాలా దేవాలయాల్లో ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంది. ఇది ఆయా దేవాలయాల అభివృద్ధికి విఘాతంగా మారింది. నిత్యం వచ్చే భక్తులు, ప్రత్యేక కార్యక్రమాలకు వచ్చే వారికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో దేవాదాయ శాఖ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఆయా ఆలయాలకు వచ్చే భక్తుల్లో ఆర్థికంగా స్థితిమంతుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. వారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ, ఆలయ పరిస్థితిని వివరించి తోచినంత విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతోంది. ఆయన మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు నిర్వహిస్తుంటారు. కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయానికి పరమభక్తుడు. ఇప్పుడు ఆయన అక్కడ రూ.4 కోట్లతో కళ్యాణమండపం, భక్తుల వసతి గృహాలు, ఇతర సౌకర్యాలు సమకూరుస్తున్నారు. ఇలా కాళేశ్వరంలో ఓ భక్తుడు రూ.కోటిన్నరతో వసతి గృహం, మరో భక్తుడు రూ.50 లక్షలతో ఆలయానికి వెండి తాపడం చేయిస్తున్నారు. కర్మన్‌ఘాట్ అభయాంజనేయస్వామి ఆలయంలో ఇద్దరు భక్తులు రూ.కోటిన్నరతో పనులు నిర్వహిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ దేవాదాయశాఖ విన్నపంతో ముందుకొచ్చిన దాతలు చేయిస్తున్న పనులే. ఈ సంవత్సరం రూ.50 కోట్లు విరాళాల రూపంలో నిధులు సమకూర్చి అభివృద్ధి పనులు నిర్వహించాలని నిర్ణయించిన దేవాదాయశాఖ, ఆయా జిల్లాల సహాయ కమిషనర్లు, దేవాలయాల ఈవోలను ఇందుకు పురమాయించింది. దీంతో దేవాలయాల ఆధ్వర్యంలో స్థానిక వర్తక సంఘాలు, ఫెడరేషన్లు, కాంట్రాక్టు సంస్థలు, ఇతరులతో సమావేశాలు నిర్వహించి దేవాదాయశాఖ ప్రతిపాదనను వారి ముందుంచారు.ఆలయాల ప్రాశస్త్యం వివరించి, ప్రతి సంవత్సరం దేవాలయ నిర్వహణకు అవుతున్న వ్యయం, వస్తున్న ఆదాయం లెక్కలు వారి ముందుంచి, కొత్తగా అవసరమైన పనులు, వాటికి అయ్యే అంచనా వ్యయం వివరాలను వెల్లడించారు. దీంతో పలువురు విరాళాలు అందజేసేందుకు ముందుకొచ్చారు. అలా గత రెండు నెలల కాలంలో ఏకంగా రూ.28 కోట్లకు అంగీకారం వచ్చింది. ఈ ఉత్సాహంతో రాష్ట్రస్థాయిలో మరో భారీ సమావేశాన్ని నిర్వహించి బడా భక్తులను ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. త్వరలో ఆ సమావేశం జరగనుంది. అది పూర్తయ్యాక లక్ష్యంగా నిర్ధారించుకున్న రూ.50 కోట్లను మించి విరాళాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. డబ్బు తీసుకోకుండా వారి ఆధ్వర్యంలోనే పనులు దేవుడికి వచ్చే విరాళాలను స్వాహా చేసిన ఘనులు దేవాదాయ శాఖలో ఎందరో. ఇప్పుడు ఈ విరాళాలు కూడా దుర్వినియోగం అయితే దేవాదాయశాఖకు మరింత చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో, దాతల నుంచి నిధులు వసూలు చేయవద్దని కమిషనర్ అనిల్‌కుమార్ ఆదేశించారు. విరాళాలు ప్రకటించిన తర్వాత వారి ఆధ్వర్యంలోనే పనులు నిర్వహించి నేరుగా వారే ఖర్చును భరించేలా చూస్తున్నారు. విరాళాలకు సంబంధించి చురుగ్గా వ్యవహరించిన వారు, ఎక్కువ విరాళాలను సేకరించిన అధికారులు, సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం నుంచి పురస్కారం ఇప్పించాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. తొలి విడతగా వచ్చే గణతంత్ర దినోత్సవం రోజున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా ప్రోత్సాహకాలను అందించనున్నారు. -
చరిత్రలో తొలిసారిగా.. దేవాలయానికి ప్రభుత్వ నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా ఒక దేవాలయం అభివృద్ధి పనుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి భారీ ఎత్తున నిధులు విడుదల చేస్తోంది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సమయంలో ఆలయం అభివృద్ధి పనులకు రూ.70 కోట్లు నిధులు ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్ ఆ మాటను నిలబెట్టుకుంటూ రూ.70 కోట్లతో దుర్గ గుడివద్ద చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. సీజీఎఫ్ కాదు.. ఖజానా నుంచే రాష్ట్రంలో ఇప్పటివరకు చిన్న ఆలయం మొదలు పెద్ద దేవాలయాల వరకు ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా సొంత నిధులు (భక్తులిచ్చే కానుకలు)తోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమాత్రం ఆదాయం లేని ఆలయాలు శిధిలావస్థకు చేరితే జీర్ణోద్ధారణకు దేవదాయ శాఖ సీజీఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) నిధుల నుంచి ఖర్చు చేస్తున్నారు. అధిక ఆదాయం సమకూరే ఆలయాల నుంచి దేవదాయ శాఖ ఏటా నిర్ణీత మొత్తంలో సేకరించే మొత్తాన్ని సీజీఎఫ్‌గా వ్యవహరిస్తారు. శిధిలావస్థకు చేరిన ఆలయాల పునఃనిర్మాణానికి ఈ నిధులు మంజూరు చేస్తుంది. అది కూడా ఇప్పటివరకు గరిష్టంగా రూ.ఐదు కోట్లకు మించి సీజీఎఫ్ నిధులు ఒక ఆలయానికి ఇచ్చిన ఉదంతాలు లేవని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.70 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించడం దేవదాయ శాఖ చరిత్రలో అపూర్వ ఘటనగా పేర్కొంటున్నారు. చదవండి: (మత విద్వేషాలకు భారీ కుట్ర) నాడు ఆలయాల నిధులు కైంకర్యం.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుండగా దీన్ని మభ్యపెడుతూ దేవదాయ శాఖ నిధులను మళ్లిస్తున్నారంటూ టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దుర్గ గుడి వద్ద అభివృద్ధి కార్యక్రమాల కోసం అమ్మవారి పేరిట ఉన్న బ్యాంకు డిపాజిట్లలో దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేసి ఆలయం చుట్టు పక్కల భూములను కొనుగోలు చేశారు. ఈ భూముల కొనుగోలు ప్రక్రియలో స్థానిక టీడీపీ నేతలు భారీగా లబ్ధి పొందగా అమ్మవారి ఆలయ నిధులు పూర్తిగా అడుగంటాయి. శ్రీశైలం దేవాలయం విషయంలోనూ బాబు ఇలాగే వ్యవహరించారు. ఆలయం వద్ద ఉన్న నిధుల కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా అభివృద్ధి పనులకు మంజూరు చేసి చివరకు అన్నదానం నిధులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టేందుకు గత సర్కారు పెద్దలు ప్రయత్నించారు. చదవండి: (మధ్యతరగతి ప్రజలకూ సొంతిల్లు) దేవాలయాలపై దాడుల్ని సహించం గుడులను కూలగొట్టినప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ–బీజేపీనే: మంత్రి బొత్స సాక్షి, విజయవాడ: దేవాలయాలపై దాడుల్ని ప్రభుత్వం సహించదని, ఏ ఒక్క మతాన్ని నిర్లక్ష్యం చేయబోమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో తొమ్మిది దేవాలయాల పునఃనిర్మాణం, దుర్గగుడి అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలసి ఆయన గురువారం పరిశీలించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైనా పట్టించుకోకుండా గత సర్కారు దేవాలయాలను కూలగొట్టిందని బొత్స మండిపడ్డారు. సుమారు రూ.1.79 కోట్లతో దేవాలయాలను పునఃనిర్మిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వమూ దుర్గగుడి అభివృద్ధికి డబ్బులు ఇవ్వలేదని, తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ రూ.70 కోట్లు ఇస్తున్నారని చెప్పారు. గతంలో గుడులను కూల్చివేసినప్పుడు టీడీపీ, బీజేపీ కలసి అధికారంలో ఉన్నాయని, జనసేన మద్దతు ఇచ్చిందని తెలిపారు. నాడు దేవదాయశాఖ మంత్రిగా బీజేపీకి చెందిన వారే ఉన్నారని గుర్తు చేశారు. రామతీర్థం ఘటనపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. పుష్కరాల పేరుతో దేవాలయాలను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టిన చంద్రబాబుకు వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దేవాలయాలను పునఃనిర్మిస్తామని తాము గతంలోనే చెప్పామని, ప్లైఓవర్ నిర్మాణం కారణంగా కొంత జాప్యం జరిగిందని వివరించారు. వందేళ్ల చరిత్ర ఉన్న దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి దేవాలయాన్ని, భక్తులు ఎంతో పవిత్రంగా భావించే సీతమ్మవారి పాదాలను, గోశాలలో గోపాలకృష్ణుడి దేవాలయాలను గత సర్కారు కూలగొట్టిందని, వీటిని పునఃనిర్మిస్తున్నామని చెప్పారు. -
కోటప్పకొండను మరింత అభివృద్ధి చేస్తాం
-
ఆలయ అభివృద్ధికి విరాళమిచ్చిన యాచకుడు
చీపురుపల్లి: వృత్తి యాచన.. దాతృత్వంలో మాత్రం ఉన్నతం. ప్రస్తుత సమాజంలో ఎంతో మంది వద్ద రూ.కోట్లు ఉండొచ్చు కానీ.. దాతృత్వంలో వారు నిరుపేదలే. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని శివాలయం వద్ద ఉన్న చేబ్రోలు కామరాజు అనే యాచకుడు మాత్రం దాతృత్వంలో నంబర్ వన్ అనిపించుకుంటున్నాడు. యాచన ద్వారా సంపాదించుకున్న ఒక్కో రూపాయినీ పొదుపు చేసి నీలకంఠేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అందజేస్తున్నాడు. భక్తులు ప్రదక్షిణ చేసుకునే సమయంలో ఎండ, వాన సమస్యలు ఎదురుకాకుండా షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు మంగళవారం రూ.60 వేలు అందజేశాడు. ఇలా మూడు, నాలుగు పర్యాయాలు దాదాపు రూ.3 లక్షల వరకు గుడికి సమర్పించుకున్నాడు. గతంలో ఆలయ పరిసరాల్లో షెల్టర్ల ఏర్పాటుకు రూ.1.2 లక్షలు, రూ.70 వేలు రెండు దఫాలుగా అందజేసాడు. 20 ఏళ్లుగా అక్కడే యాచన శ్రీకాకుళం జిల్లాలోని ఒప్పంగి గ్రామానికి చెందిన కామరాజు రెండు దశాబ్దాల క్రితమే చీపురుపల్లి వచ్చేశాడు. ఇక్కడి ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయం వద్ద రోజూ యాచన చేస్తాడు. ఆలయం ఎదురుగా ఉన్న చిన్న పూరిగుడిసెలో నివసిస్తాడు. అలా బిచ్చమెత్తుకుని సంపాదించిన మొత్తాన్ని శివాలయం అభివృద్ధికే వెచ్చిస్తానని చెబుతున్నాడు. -
జోగుళాంబదేవినే మరిచారు!
అలంపూర్ రూరల్ : జోగుళాంబ గద్వాలలో శుక్రవారం పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, తన ప్రసంగంలో అలంపూర్ నియోజకవర్గం, జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధి గురించి ప్రస్తావించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కృష్ణా పుష్కరాల సందర్భంగా అలంపూర్ వచ్చిన సీఎం, అనేక అభివృద్ధి అంశాలపై హామీలు ఇచ్చారు. అయితే, జోగుళాంబ ఆలయ అభివృద్ధి విషయమై కేంద్ర పురావస్తు శాఖతో మాట్లాడతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొన్నటి సభలో ఆలయాల గురించి మాట్లాడకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పుష్కరాలపై దృష్టి ఏదీ? యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో ప్రవహించే తుంగభద్ర నది పుష్కరాలకు సమయం సమీపిస్తున్నా సీఎం కేసీఆర్ ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. 2020 మార్చి 31నుంచి ప్రారంభంకానున్న తుంగభద్ర నదికి ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ వేయించడం, ఆలయాల పరిసరాలను భక్తుల రద్దీకి అనుగుణంగా ఆధునీకరించడం వంటివి చేయాల్సిఉంది. ఈనేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖతో ఈ ప్రభుత్వం అనుమతులు కోరేదెన్నడు? మాస్టర్ ప్లాన్ వేయించేదెన్నెడు? నివాస గృహాల నష్ట పరిహారాలు అందించేదెన్నడు? ఇలా అనేక రకాలుగా అలంపూర్ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లాకు ఒరిగింది ఏమీ లేదు సీఎం పర్యటనతో జిల్లాకు ఒరిగింది ఏమీ లేదు. ప్రతిపక్షాల గొంతునొక్కే విధం గా ఎమ్మెల్యే సంపత్‌ను గృ హనిర్భంధం చేశారు. జోగుళాంబ అమ్మవారి పేరు కానీ, గత హామీలు కానీ ఎక్కడా ప్రస్తావించకుండా మరొకరు ప్రశ్నించకుండా సభను ముగించారు. ఈవైఖరి సరికాదు. – జెట్టి రాజశేఖర్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రశ్నిస్తాననే గృహ నిర్బంధం సీఎం కేసీఆర్ గతంలో అలంపూర్ వచ్చిన సమయంలో ఆలయం, నియోజకవర్గ అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారు. వాటి అమలుపై ప్రశ్నించాల్సిన నైతిక బాధ్యత ఎమ్మెల్యేగా నాపై ఉంది. నేను ప్రశ్నిస్తాను అనే భయంతోనే గృహనిర్బంధం చేయించారు. – ఎస్. సంపత్‌కుమార్, ఎమ్మెల్యే అలంపూర్ అమ్మ మొక్కు మరిచారు సీఎం కేసీఆర్ బెజవాడ కనకదుర్గమ్మకు, తిరుపతి వెంకన్నకు, అంతకుముందు కొండగట్టు అంజన్న, వేములవాడ, యాదాద్రి, భద్రాద్రిలో మొక్కలు చెల్లిస్తూ వస్తున్నారు. కానీ జోగుళాంబ అమ్మ మొక్కు మరిచారు. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పిన మాటలు అడియాశలే అయ్యాయి. – బోరింగ్ శ్రీనివాస్, జోగుళాంబ సేవాసమితి అధ్యక్షుడు -
నందిగుండం ఆలయాభివృద్ధికి కృషి
నిర్మల్‌టౌన్ : నందిగుండం ఆలయ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని విశ్వనాథ్‌పేట్‌లోని నందిగుండం దుర్గామాత ఆలయ అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.50 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. మున్ముందు సహకారం అందేలా చూస్తాననన్నారు. దసరా వరకు అభివృద్ధి పనులు పూర్తవుతాయని తెలిపారు. అనంతరం మంత్రికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జ్ఞాపికను బహూకరించారు. ఇందులో ఆలయ కమిటీ అధ్యక్షడు లక్కడి జగన్మోహన్రెడ్డి, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండాజీ వెంకటాచారి, ఆలయ ధర్మకర్త ముత్యం సంతోష్‌గుప్త, కొరిపెల్లి దేవేందర్‌రెడ్డి, దేవరకోట చైర్మన్ ఆమెడ కిషన్, బీజేపీ నాయకుడు రావుల రాంనాథ్ తదితరులు ఉన్నారు. -
ఆలయ అభివృద్ధికి సహకరిస్తాం
ఐ.పోలవరం: ఆలయ అభివృద్ధికి ప్రభుత్వపరంగా సహకరిస్తానని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. కేశనకుర్రులో జరుగుతున్న రుద్రయాగంలో ఆయన ఆదివారం పాల్గొని పూజలు చేశారు. వ్యాస భగవానునిచే ప్రతిష్టించబడిన ఉమా సమేత వ్యాసేశ్వరస్వామి ఆలయంలో 11 రోజుల పాటు నిర్వహించే శ్రీరుద్ర మహాయాగం ఆదివారం పదో రోజు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావుకు, స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకు ఆలయ మర్యాదలతో గ్రామస్తులు, అధికారులు స్వాగతం పలికి యాగ విశిష్టతను తెలిపారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మహిమగల ఈ పుణ్యక్షేత్రంలో ఇటు వంటి యాగాలు జరగడం ఆనందం అని, శివారు ప్రాంతం అయినా ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం హర్హణీయమన్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మరో పుణ్యక్షేత్రం మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయ పలు అభివృద్ధి పనులకు అధికారులచే ప్రతిపాదనలు సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రుద్రయాగాన్ని భీమవరానికి చెందిన యీవని వెంకటరామచంద్ర సోమయాజి ఘనపాఠి, మచిలీపట్నానికి చెందిన యాగబ్రహ్మ రాళ్లపల్లి వేంకటేశ్వర శాస్త్రిల సారధ్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం ఏకాదశ రుద్ర కలశావాహనము, మహాన్యాస పూర్వక ఏకాదశ శ్రీరుద్ర కలశాభిమంత్రణము, రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, రుద్ర క్రమార్చన, అధ్యాత్మిక ప్రవచనాలు జరిగాయి. ఈ పూజల్లో ఎమ్మెల్యే బుచ్చిబాబు పాల్గొని స్వామి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ మంత్రి మాణిక్యాలరావును, ఎమ్మెల్యే బుచ్చిబాబును సత్కరించారు. ఈ సందర్భంగా ఈ పూజలు తిలకించేందుకు వచ్చిన భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు. వీరి వెంట వి.సూర్యనారాయణ రాజు, జంపన బాబు తదితరులు పాల్గొన్నారు. -
‘భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం’
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ వంద కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. యాత్రికులకు సౌకర్యాల కల్పనకు, పర్యాటకం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. -
మల్లన్న ఆదాయం రూ.24 లక్షలు
సిద్ధిపేట : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి హుండీల ఆదాయం రూ 24 లక్షల 37 వేలు 021 నగదు వచ్చింది. ఆలయ ఈవో రామకృష్ణారావు, ప్రత్యేక అధికారి ఏసీ కార్యాలయం అధికారి అనిల్ ఆధ్వర్యంలో 15 హుండీలను శుక్రవారం లెక్కించారు. రూ 24 లక్షల నగదు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడున్నర కిలోల వెండితో పాటు 29 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని అధికారులు చెప్పారు. ఈ ఆదాయం 82 రోజుల్లో చేకూరిందని ఆలయ అభివద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈవో కోరారు. -
యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
యాదాద్రి: యాదాద్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం మధ్యాహ్నం యాదగిరిగుట్టకు చేరుకున్నారు. యాదగిరిగుట్టలో ఆయనకు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను కేసీఆర్ పరిశీలించారు. ఆయనతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, విప్ సునీత, ఎమ్మెల్యే కిశోర్, కలెక్టర్ అనితా రామచంద్రన్ తదితరులు ఉన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ భద్రతా ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. -
కృష్ణా, గోదావరి తీరాన వెంకన్న ఆలయాలు
భద్రాచలం మాదిరిగా ఒంటిమిట్ట ఆలయం అభివృద్ధి తిరుమలలోనే వేయికాళ్ల మండపం నిర్మాణం టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తిరుమల: రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డున, ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున శాశ్వత ప్రాతిపదికన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. మంగళవారం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డి.సాంబశివరావు నేతృత్వంలో ధర్మకర్తల మం డలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్, ఈవో మీడియాకు వెల్లడించారు. విజ యవాడలోని విద్యాధరపురంలో శ్రీవారి ఆల యాన్ని నిర్మించేందుకు రూ.76 లక్షల విలువైన 843 చదరపు గజాల స్థలాన్ని విశాఖపట్నంకు చెందిన శకుంతలాదేవి ఇటీవల విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్థలం మార్కెట్ విలువ కోట్లలో ఉంటుందని ఈవో తెలిపారు. మరికొన్ని ప్రధాన తీర్మానాలు వైఎస్సార్‌జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని ప్రభుత్వం టీటీడీలో విలీనం చేస్తూ ఇటీవల తీర్మానం చేసింది. ఆమేరకు ఆలయాన్ని భద్రాచలం తరహాలో అభివృద్ధి చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అక్కడ సీతారామలక్ష్మణ స్వామితోపాటు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఆంజనేయస్వామి విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో వేయికాళ్ల మండపం పునఃనిర్మాణం చేయనున్నారు. ఇందులో భాగంగా డిజైన్ల రూపకల్పనపై చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సభ్యులు కె.రాఘవేంద్రరావు, పలువురు సభ్యు లు, అధికారులతో కమిటీ నియమించారు.టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే పీసీఏ (యాత్రికుల పరిహార భత్యం) రూ. 1,500 నుంచి రూ. 2,500కి పెంచుతూ నిర్ణయించారు. రూ.9.8 కోట్లతో తిరుపతిలోని మొదటి, రెండో సత్రాల అభివృద్ధి చేయనున్నారు. రూ. 72 కోట్లతో నిర్మించనున్న శ్రీవారి సేవా సదన్ల నిర్మాణ పనులకు అనుమతి. రూ. 59 లక్షల విలువైన 128 కేజీల వెండితో గోవిందరాజస్వామి ఆలయంలోని పీఠాలకు తాపడం పనులు చేస్తారు. రూ. 25 లక్షలతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు ఆమోదం తెలిపారు. రూ. 1.57 కోట్లతో 2.5 లక్షల రవికె గుడ్డలు, రూ. 1.52 కోట్లతో 1.75 లక్షల కేజీల కంది పప్పు, రూ. 73 లక్షలతో 1.08 కేజీల చింతపండు, రూ. 3.66 కోట్లతో 2.5 కోట్ల పాలిథిన్ సంచులు, రూ. 1.92 కోట్లతో 22 లక్షల కొబ్బరికాయలు కొనుగోలు చేయనున్నారు. రూ. 7.45 కోట్ల ఖర్చుతో తిరుమలలో హౌస్‌కీపింగ్, శానిటేషన్ పనుల నిర్వహణకు ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్‌కు రెండేళ్ల కాలపరిమితితో అనుమతి. -
ఇక.. చకచకా
యాదగిరికొండ/యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. బుధవారం నుంచి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అదే విధంగా ఆలయ బృహత్ ప్రణాళిక కోసం వేసిన రెండు కమిటీలు (కిషన్‌రావుతో కూడిన కమిటీ, స్థల సేకరణకు మరో కమిటీ) చకచకా పనులు పూర్తి చేస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ పూర్తి చేసుకుని ఆలయానికి సంబంధించిన ప్రణాళికతో ఆర్కిటెక్టులు, స్థపతులు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరో వారం, పది రోజుల్లో ఆర్అండ్బీ శాఖ నాలుగు లేన్ల రోడ్డు పనులు ప్రారంభించనుంది. ఎవరిపనులను వారికి అప్పగించిన సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఆలయానికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్ దాదాపు పూర్తయ్యింది. దీనిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం కోసం ఆర్కిటెక్ట్‌లు, స్థపతులు, వైటీడీఏ అధికారులు వేచి చూస్తున్నారు. ఆలయాన్ని పూర్తి విశాలంగా చేయాలని సీఎం కేసీఆర్ ఉద్దేశమని తెలుస్తోంది. అటానమస్‌తో పెరగనున్న ఆదాయం గుట్ట దేవస్థానం త్వరలో అటానమస్‌గా చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచా రం. దీంతో ఆలయ రూపురేఖలు మారిపోతాయని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గుట్ట దేవస్థానం ఆదాయం ప్రతి యేటా సుమారు 100 కోట్లు వస్తోంది. అటానమస్‌గా చేసి అభివృద్ధి పరిస్తే రూ. 500 కోట్ల ఆదాయం సమకూరుతుం దని నిపుణులు చెబుతున్నారు. భక్తులకు వసతి సౌకర్యాలు పెరగడంతోపాటు వసతి గదులు, దు కాణాలు, అర్చనలు, అభిషేకా లు, నిత్యకల్యాణాలు, దర్శనాలు వీటి ద్వా రా ఆదాయం చాలా వరకు పెరుగుతుందని దేవస్థానం అధికారుల సైతం చెబుతున్నారు. మొదటి రోజు రిజిస్ట్రేషన్లు.. యాదగిరిగుట్ట అభివృద్ధికి 2 వేల ఎకరాల భూసేకరణలో భాగంగా మొదటి దశ ఓ కొలిక్కి ఇచ్చింది. బుధవారం కొందరి రైతుల నుంచి వైటీడీఏ(యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంది. వైటీడీఏ కార్యదర్శి, డిప్యూటీ కలెక్టర్ ఎం.రమేశ్‌రెడ్డి, భువనగిరి ఆర్డీఓ మధుసూదన్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు ఉదయాన్నే యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. గుండ్లపల్లి రెవెన్యూ కిందికి వచ్చే డాక్టర్ రచ్చ యాదగిరి, రచ్చ సురేష్, రచ్చ శ్రీనివాస్ కుటుంబానికి చెందిన 15ఎకరాల పదమూడున్నర గుంటల భూమికి సం బంధించిన మొట్టమొదటి డాక్యుమెంట్‌ను పరిశీలించారు. అనంతరం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రచ్చ యాదగిరి కుటుంబ సభ్యులు, వైటీడీఏ కార్యదర్శి రమేశ్ రెడ్డి సంతకాలు చేశారు. బుధవారం మొత్తంగా గుండ్లపల్లికి చెందిన 16 మంది రైతులు, దాతర్‌పల్లికి చెందిన ఇద్దరి రైతులనుంచి 80 ఎకరాల ముప్పయిఐదున్నర గుంటల భూమిని వైటీడీఏకు రిజిస్ట్రేషన్ చేశారు. సంబంధిత రైతులకు నష్టపరిహారం కింద 8 కోట్ల 37లక్షల రూపాయలు చెల్లించారు. కాగా, మరో 50 ఎకరాలు రైతులు ఇవ్వడానికి ముందుకు వచ్చారని, వివాదం లేని 28 ఎకరాలు, 19 ఎకరాలు అసైన్మెంట్ భూమి, మరో 50 ఎకరాలు మొత్తం 157 ఎకరాల భూమిని రెండురోజుల్లో కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఇక వేగంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదటి దశలో దాతర్పల్లి, గుండ్లపల్లి గ్రామాల నుంచి అంగీకరించిన రైతులతో భూములను రిజి స్ట్రేషన్ చేసుకునేందుకు భూ సేకరణ కమిటీ, వైటీడీఏ ప్రణాళిక రూపొందించాయి. మొదటి దశలో దాతర్పల్లి గ్రామంలో 127 ఎకరాలు, గుండ్లపల్లి గ్రామంలో 192 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకోనుంది. ఎట్టిపరిస్థితుల్లో 300 ఎకరాలు రైతుల నుంచి త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం 33 డాక్యుమెంట్లు సిద్ధం చేశారు. సంబంధిత రైతులకు వెంటనే నష్టపరిహారం నగదు కూడా అందజేయనున్నారు. వాయిదా పడుతూ వచ్చినా ... భూ సేకరణ కమిటీ అధికారులు రెండు వారాల క్రితం గుట్టలో విస్తృతంగా మలిదశ చర్చలు జరిపార. గుండ్లపల్లికి చెందిన 35 మంది రైతులు, దాతర్‌పల్లికి చెందిన 15 మంది రైతులతో అనేక దఫాలుగా చర్చలు జరిపారు. వీరిలో 20 మంది వరకు రైతులు దేవస్థానం అభివృద్దికి తమ భూ ములు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. వీరిలో కొందరు దేవస్థానం అభివృద్ధికి తమ భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చారు. వారి భూములను వైటీడీఏకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వారం రోజులుగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా, వివిధ కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. రెండు రోజుల క్రితం డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఎం.రమేశ్‌రెడ్డిని వైటీడీఏకు కార్యదర్శిగా నియమించడంతో రిజిస్ట్రేషన్ల కార్యక్రమం ప్రారంభమైంది. -
ఆలయాల అభివృద్ధికి వెయ్యికోట్లివ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని దేవాలయాల అభివృద్ధికోసం, అర్చకుల సంక్షేమంకోసం రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉపేంద్రశర్మ కోరారు. తెలంగాణలోని అర్చక సమాఖ్య అధ్యక్షులు, ప్రతినిధులతోపాటు ఆయన శనివారం ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్యను కలిసి అర్చకుల సమస్యలు, దేవాలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు. విలేకరులతో మాట్లాడారు. తమ డిమాండ్లను వారు వివరించారు. అవి.. తెలంగాణలోని 11 వేల దేవాలయాల్లో పనిచేస్తున్న లక్షా నలభైవేల అర్చక ఉద్యోగుల స్థితిగతిపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలి. 2007లో చేసిన దేవాదాయశాఖ చట్టసవరణను అనుసరించి.. సెక్షన్ 68-ఏ ప్రకారం వేతన సవరణ చట్టాన్ని అమలు చేయాలి. అనేక ప్రధాన దేవాలయాల్లో మూడేళ్లక్రితం వేద పారాయణదారులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. వారిని క్యాడర్ స్ట్రెంత్‌లో చేర్చాలి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అమలు చేసిన అర్చక సంక్షేమ పథకాలను కొనసాగించాలి. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ధూప, దీప, నైవేద్య పథకంలో పనిచేసే అర్చకులకు రూ.2,500 నుండి రూ.6,000 వరకు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి.