సాక్షి,విజయనగరం: దేవాలయాల పరిరక్షణపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. '' దేవాలయాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. అన్యక్రాంతం అవుతున్న దేవాదాయశాఖ భూములను కాపాడుకునే దిశగా జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నాం. దేవాలయాలకు సంబందించిన కమర్షియల్ స్థలాలు అభివృద్ధి చేసి, ఆదాయాన్ని పెంచుకుంటాం. అనేక భూములు చంద్రబాబు దారాదత్తం చేశారు. ఆక్రమణలు జరగకుండా పరిరక్షణ కు చర్యలు చేపడుతున్నాం. 40 వేల సీసీ కెమారాలను ఆలయాల వద్ద అమర్చడం జరిగింది.విమర్శమకు తావివ్వకుండా టెంపుల్ వద్ద భద్రతపెంచి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నలభై టెంపుళ్లను చంద్రబాబు కూలిస్తే జగన్ పునఃనిర్మాణం చేసేందుకు పూనుకున్నారు'' అని తెలిపారు.
దేవాలయాలపై సమీక్ష జరగడం ఇదే తొలిసారి
మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. '' దేవాలయాలపై సమీక్ష జరగడం ఇదే తొలిసారి. జిల్లాల వారీగా సమీక్ష చేసి వాస్తవ పరిస్థితులు తెలుకోవడం మంచిదే.. ఇందుకు అభినందిస్తున్నాను.. వంద ఇళ్లుల వద్ద ఒక ఆలయం నిర్మించాలనడం మంచి నిర్ణయం.. ఇందుకు పది లక్షలు ఇస్తుంది.. జగనన్న కాలనీలు నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ అన్ని వర్గాలు వారు ఉంటారు.. ఇవి పెద్ద గ్రామాలుగా మారనున్నాయి. జిల్లాలో వంద గ్రామాలలో నామ్స్ ప్రకారం గుడ్లుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నా. ఏసీ ఆఫీసు నిర్మాణం చేయాలని నిర్ణయించారు.. ఇందుకు మా సహకారం అందుతుంది.. సూపరింటెండెంట్ దగ్గర నుంచి డీసీ వరకు మీ పరిధిలో ఉన్న ఆస్తిపాస్తులు పై అవగాహన పెంచుకోవాలి. వేణు గోపాల స్వామి టెంపుల్ లో బంగారు ఆభరణాలు ఉన్నాయని ప్రజలే చెబుతున్నారు. అవి ఎన్నున్నాయి అని చూసుకోవాలి. ఇది ప్రజల సెంటిమెంట్ కావునా జాగ్రత్తగా ఉండాలి'' అని పేర్కొన్నారు.
దేవాలయాలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం
Published Wed, Jun 9 2021 1:42 PM | Last Updated on Wed, Jun 9 2021 1:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment