
(ఫైల్ ఫొటో)
సిద్ధిపేట : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి హుండీల ఆదాయం రూ 24 లక్షల 37 వేలు 021 నగదు వచ్చింది. ఆలయ ఈవో రామకృష్ణారావు, ప్రత్యేక అధికారి ఏసీ కార్యాలయం అధికారి అనిల్ ఆధ్వర్యంలో 15 హుండీలను శుక్రవారం లెక్కించారు.
రూ 24 లక్షల నగదు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడున్నర కిలోల వెండితో పాటు 29 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని అధికారులు చెప్పారు. ఈ ఆదాయం 82 రోజుల్లో చేకూరిందని ఆలయ అభివద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈవో కోరారు.