చార్మినార్ (హైదరాబాద్) : చార్మినార్, మక్కా మసీదులు చూసేందుకు వచ్చే సందర్శకులకు యాచకుల వేధింపులు ఎక్కువయ్యాయి. పర్యాటక కేంద్రాలు కావడంతో దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు అధిక సంఖ్యలో నిత్యం పాతబస్తీని సందర్శిస్తుంటారు. చార్మినార్, మక్కా మసీదుల వద్ద తిష్ట వేసిన యాచకులు పర్యాటకులను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిల్లర లేదని చెప్పినా వినకుండా వెంట పడి ఇచ్చేంత వరకు సతాయిస్తున్నారు. దీంతో వీరిని కట్టడి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.