ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): రోడ్డుపై దొరికిన బంగారాన్ని పంచుకునే క్రమంలో యాచకుల మధ్య తలెత్తిన వివాదం చివరకు పోలీసుల వరకు వెళ్లి గొలుసు పోగొట్టుకున్న మహిళకు ఊరట కలిగించింది. వివరాల్లోకి వెళితే....ఈ నెల 25న ఉప్పుగూడ తానాజీనగర్‌కు చెందిన స్వాతి అనే మహిళ చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాల్లో దర్శనానికి వెళ్లిన క్రమంలో నాలుగు తులాల బంగారు గొలుసును పోగొట్టుకుంది. ఈ విషయమై ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉండగా ఈ గొలుసు చార్మినార్ వద్ద యాచకులకు దొరికింది. దీనిని పంచుకునే క్రమంలో వారి మధ్య వివాదం తలెత్తింది. దీంతో వీరిలో ఒకరు చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు గొలుసును స్వాధీనం చేసుకొని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. ఈ గొలుసు స్వాతికి చెందిందని నిర్ధారించిన పోలీసులు....ఆమెకు అప్పగించనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment