సాక్షి, ముంబై: నగరంలోని అనేక ప్రాంతాల్లో నిర్మించిన ఆకాశవంతెన (స్కైవాక్)లు నిరుపయోగంగా మారుతున్నాయి. అవి యాచకులు, మాదకద్రవ్యాల బానిసలు, మద్యప్రియులు, జూదగాళ్లు, ప్రేమికులు, ఆకతాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి. వీరంతా స్కైవాక్‌లపైనే తిష్టవేస్తున్నారు. వాటిని దుర్గంధమయం చేస్తున్నారు. దీంతో వాటిని వినియోగించుకునేందుకు బాటసారులు, మహిళలు, పిల్లలు జంకుతున్నారు. రాత్రి వేళల్లో వెళ్లేందుకు పురుషులు కూడా జంకుతున్నారు. కాగా నగర రహదారులను హాకర్లు ఆక్రమిస్తున్నారు. సమస్య రైల్వేస్టేషన్ల వద్ద తీవ్రంగా ఉంది.
రైలు దిగిన ప్రయాణికులు రోడ్డెక్కాలంటే నానా తంటాలు పడాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) స్కైవాక్‌ల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా రైలు దిగిన ప్రయాణికులు నేరుగా ఆటో, బస్టాండ్ లేదా రహదారి చేరుకుంటారని ఆ సంస్థ భావించింది. అయితే అనుకున్నదొక్కది.... అయ్యిందొక్కటి అనే చందంగా స్కైవాక్‌ల పరిస్థితి మారింది. స్కైవాక్‌లను ఎక్కడం బాగా కష్టంగా ఉండడంతో వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు రహదారులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో వీటి నిర్మాణానికి అర్థమే లేకుండాపోయింది. ఈ కారణంగా ఇవి అలంకార ప్రాయంగా మారాయి.
ఆకాశవంతెనలు నిరుపయోగం
Published Sun, Jan 12 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement
Advertisement