సాక్షి, ముంబై : నగర వాసుల సౌకర్యార్థం సుమారు రూ.40 కోట్లు వెచ్చించి గ్రాంట్‌రోడ్‌లో నిర్మించిన స్కైవాక్ నిరుపయోగంగా మారింది. ఈ స్కైవాక్ ఉపయోగించాలంటే దాదాపు 60 మెట్లు ఎక్కి దిగాల్సి ఉంది. చాలా మంది ఈ స్కైవాక్‌ను ఉపయోగించుకోవడానికి ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. వృద్ధులు వీటి జోలికి వెళ్లడం లేదు. ప్రస్తుతం భిక్షగాళ్లు, తాగుబోతులకు అడ్డాగా మారింది.
స్కైవాక్‌ను నానాచౌక్ నుంచి తాడ్దేవ్, కెంప్స్ కార్నర్, లామింగ్ టన్ రోడ్, గిర్గావ్ చౌపాటీ, ఒపేరా హౌజ్ ప్రాంతాల ప్రజలకు సౌకర్యాంగా ఉండేందుకు నిర్మించినా ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా, ఈ స్కైవాక్‌కు వ్యతిరేక దిశలో ఉన్న ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఫ్లై ఓవర్‌లో కొంత భాగాన్ని బారికేడ్లతో కవర్ చేయలేదు. వెండర్లు, భిక్షాటన చేసేవారు, ఆకాతాయిలు పరిసర ఇళ్లలోని నివాసితుల పట్ల అసభ్య దూషణకు పాల్పడుతున్నారు.
కిటికీలకు వ్యతిరేక దిశలోనే స్కైవాక్ నిర్మించడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని పలువురు నివాసితులు వాపోతున్నారు. ఈ విషయమై మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనితా పర్‌దేశి మాట్లాడుతూ..భిక్షాటన చేసేవారిని, తాగుబోతులను ఎప్పటికప్పుడు ఈ స్కైవాక్‌పై నుంచి తరిమేస్తున్నామని అన్నారు. మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
నిరుపయోగంగా స్కైవాక్
Published Sat, Aug 9 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement