యాచకుల ఆదాయం..ఏటా రూ.270 కోట్లు! | The annual income of Rs 270 crore beggars ..! | Sakshi
Sakshi News home page

యాచకుల ఆదాయం..ఏటా రూ.270 కోట్లు!

Published Mon, Nov 21 2016 11:07 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

యాచకుల ఆదాయం..ఏటా రూ.270 కోట్లు! - Sakshi

యాచకుల ఆదాయం..ఏటా రూ.270 కోట్లు!

గ్రేటర్‌లో 20 వేల మంది బెగ్గర్స్..
పిల్లలు, వృద్ధులు సైతం భారీ సంఖ్యలో..
ఏటా దాదాపు రూ.270 కోట్లు ఆర్జిస్తున్న వైనం..
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో  ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ ప్రోగ్రాం షురూ..

సిటీబ్యూరో నగరంలో యాచకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పలు సిగ్నళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద పెద్ద సంఖ్యలో యాచకులు సంచరిస్తున్నారు. వీరిలో నెలలు నిండని పసికందులను చంకలో ఎత్తుకున్న మహిళల నుంచి...ఐదారేళ్లలోపు బాలలు, వృద్ధుల వరకు ఉన్నారు. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల మేరకు నగరంలో ఉన్న 20 వేల మంది యాచకులు రోజుకు రూ.75 లక్షల చొప్పున ఏటా దాదాపు రూ.270 కోట్లు సంపాదిస్తున్నారు. వ్యవస్థీకృతమైన ఈ యాచక వృత్తిని నిర్మూలించేందుకు గత జూన్‌లో జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నగరాన్ని ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’గా మార్చేందుకు అడుగులు వేస్తోంది.

20 వేల మంది..
వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలను బట్టి గ్రేటర్‌లో రమారమి 20 వేలమంది యాచక వృత్తిలో ఉన్నారు.  వీరిలో దాదాపు 90 శాతం మంది నకిలీలే. అంటే, పని చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ (అశక్తులు, అంగవికలురు, యాచన తప్ప ఇతర పనులు  చేయలేనివారు కాకుండా) యాచన చేస్తున్నవారు. అసలైన యాచకులు పదిశాతం లోపునే ఉన్నారని ఆయా సంస్థలు గుర్తించారుు. కొన్ని సంస్థలైతే నిజమైన యాచకులు వెరుు్యమంది కూడా లేరని చెబుతున్నారుు. ఫ్‌లై(ఫ్యూచర్ లీడింగ్ మిషన్), ‘యూత్ ఫర్ సేవ’  ‘ ఇందిరా ప్రియదర్శిని రూరల్ ఏరియా డెవలప్‌మెంట్ సర్వీస్ సొసైటీ’ ‘ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీఓస్ ఫర్ బెగ్గర్ ఫ్రీ సొసైటీ’ లోని వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల సగటు వివరాల మేరకు  నగరంలోని యాచకులకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలున్నారుు. వాటి మేరకు నగరంలో గుంపులుగా, వ్యక్తిగతంగా యాచన వృత్తిని కొనసాగిస్తున్నారు. బిచ్చగాళ్లతో దందా చేరుుస్తున్న దళారులు నగరంలో 200 మందికి పైగా ఉన్నారు. అరుుతే వీరు గుడ్డివారు, అంగవికలురు, ఎలాంటి పనులు చేయలేనివారు, పసిబిడ్డలనే తమ దందాకు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. పేద కుటుంబాలకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చి, ఆ అప్పు తీర్చేందుకు మీ పిల్లలను పంపమంటూ వారిని ఈ ఊబిలో దింపుతున్నారు.

వారి ద్వారా వస్తున్న సొమ్ము వడ్డీకే సరిపోరుుందంటూ, వారికి కొంత మొత్తాన్ని మాత్రం కమీషన్‌గా ముట్టజెపుతూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. వీరు కాక యువకులు, శక్తి ఉండి ఈ వృత్తిలో కొనసాగుతున్న వారిలో  బీహార్, మధ్యప్రదేశ్‌లతో సహా ఇతర రాష్ట్రాల వారే ఎక్కువగా ఉన్నారు. వివిధ జంక్షన్లు, ప్రార్థనా మందిరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ తదితర ప్రాంతాల్లో  వీరు అడుక్కుంటున్నారు. ఈ పని అరుుతే సులభంగా ఉంటుందని, శ్రమ ఉండదని ఈ అవతారమెత్తినవారూ ఎందరో ఉన్నారు.   మరికొందరు పార్ట్‌టైమ్‌గాను, పండుగలు, ఉత్సవాల సందర్భాల్లో మాత్రమే ఈ పని చేస్తున్నారు. ఈ వృత్తిని  వారు చిన్నతనంగా భావించడం లేదు. పెపైచ్చు త్వరితంగా, సులభంగా డబ్బు సంపాదనకు ఇదే మేలైన మార్గమని భావిస్తున్నారు.

వ్యసనాలు అధికం..
వీరిలో  చాలామందికి మద్యం, ఇతరత్రా మత్తుపదార్థాల వ్యసనం ఉంది. వచ్చే  సంపాదనలో 40-50 శాతం ఇందుకే ఖర్చు చేస్తున్నారు. 20 శాతం మాత్రం ఆహారం కోసం వినియోగిస్తున్నారు. మిగతా సొమ్మును తెలిసిన వారి వద్ద, ఊళ్లలోని బంధువుల వద్ద ఉంచుతూ పొదుపు చేస్తున్నారు. బ్యాంకుల్లో జమ చేస్తున్నవారు, వడ్డీలకు తిప్పుతున్న వారు సైతం ఉన్నారు. ఓ నకిలీ బిచ్చగాడికి బ్యాంక్ లాకర్‌తో సహ నగరంలోని రెండు చోట్ల ఇళ్లు ఉండటం కూడా మేయర్ దృష్టికి వచ్చింది.

బాలల ఆదాయం రూ. 500 ..
ఈ ఊబిలో బందీలుగా ఉన్న బాలలు రోజుకు సగటున  రూ.500 వరకు ఆర్జిస్తున్నారు.  ఈ వృత్తిలోని మహిళల్లో కొందరు పగటి పూట యాచన చేస్తూ, రాత్రి వేళల్లో సెక్క్‌వర్కర్లుగా మారుతున్నారు. వీరిలోని కొందరు మగవాళ్లకు ముగ్గురు భార్యలు కూడా ఉన్నారు. వారు  తమ సంతానాన్ని సైతం ఇదే వృత్తిలోకి దింపుతున్నారు. 15 - 25 ఏళ్ల వయసు వారు చిన్న చిన్న దొంగతనాలతోపాటు ఇతర నేరాలకు పాల్పడుతున్నారు. వీరిలో 90 - 95 శాతం మంది పునరావాసం కల్పిస్తామన్నా, వృద్ధాశ్రమాలు/విద్యాసంస్థలు/ ఆశ్రమాలు/ అనాథ శరణాలయాల్లో  చేరుస్తామన్నా ముందుకు రావడం లేరు. ఈ వృత్తిని వీడటానికి ఏమాత్రం సుముఖంగా లేరు.

పసికందులతో దందా..
దాదాపు మూడువేల మంది పసికందులతో ఈ వ్యాపారం చేస్తున్నారని మేయర్ రాంమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా యాచన తప్ప ఏపనీ చేయలేని అసహాయులను అన్నివిధాలా ఆదుకుంటామని, ఈ దిశగా ఇప్పటికే కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్జీవోలకు తగిన సహకారం అందిస్తామన్నారు. యాచనను కొనసాగించే నకిలీ బెగ్గర్స్‌పై  చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లాంఛనంగా ప్రారంభం...
నగరంలో ‘బెగ్గర్ ఫ్రీ సిటీ ’ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. గ్రేటర్‌లోని ఎల్‌బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో యాచన చేస్తున్న వారిలో 50 మందిని నగర శివారు చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి తరలించారు.   వీరిని అక్కడకు తరలించే వాహనాన్ని సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు గత జూన్‌లో శ్రీకారం చుట్టారు. పోలీసు విభాగంతోపాటు వివిధ ప్రభుత్వశాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 500 మంది యాచకులను గుర్తించామని, వీరందరినీ దశలవారీగా పునరావాస కేంద్రాలకు పంపించడంతోపాటు, పనులు చేయగలిగిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నగరంలో వ్యవస్థీకృతమైన బెగ్గింగ్‌ను రూపుమాపేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మానాన్న అనాథాశ్రమం నిర్వాహకులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే దాదాపు 200 మందికి అమ్మానాన్న అనాథాశ్రమంలో పునరావాసం కల్పించినట్లు  మేయర్ ఈ సందర్భంగా తెలిపారు.

నగరంలో యాచకుల సంఖ్య: 20 వేలు
బాలలు: 3 వేల మందికి పైగా..
నకిలీ యాచకుల సంఖ్య: 90 శాతం
రోజువారీ సంపాదన: రూ. 75 లక్షలు
ఏడాదికి దాదాపు: రూ.270 కోట్లు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement