
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘పోకిరి’సినిమాలో బ్రహ్మనందం, బిచ్చగాళ్ల సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది. కొంతమంది యాచకులు బ్రహ్మిని చుట్టుముట్టి బాబు.. బాబు అంటూ డబ్బుల కోసం వేధిస్తుంటారు. డబ్బులు ఇచ్చినా వదలరు. చివరకు వాళ్లకి క్షమాపణ చెప్పి వెళ్లిపోతాడు. అచ్చం అలాంటి ఘటననే హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌కు ఎదురైంది.
రోజూ మాదిరే జిమ్ సెంటర్‌కి వెళ్లింది ప్రగ్యా. జిమ్ చేసి బయటకు వచ్చేసరికి కొంతమంది పిల్లలు డబ్బులు అడుగుతూ కనిపించారు. వారికి కాస్త డబ్బులు తీసి ఇచ్చి కారు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలో మరికొంతమంది యాచకులు వచ్చి.. మేడమ్ మేడమ్ అంటూ ప్రగ్యాని తెగ విసిగించారు. బౌన్సర్స్ ఉన్నా కూడా ఏం చేయలేకపోయారు. కారు డోర్ అద్దాలు పైకి ఎత్తకుండా చేతులు పెట్టి అడ్డుకున్నారు. దీంతో ఆమె తన దగ్గరున్న డబ్బులన్ని వాళ్లకే ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రగ్యా ప్రస్తుతం బాలయ్య సరసన ‘అఖండ’లో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment