
పిజ్జా లవర్స్‌కి ఓ షాకింగ్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: పిజ్జా ప్రియులకు మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. డామినోస్ పిజ్జా ఆర్డర్ చేసినపుడు తనకు ఎదరైన చేదు అనుభవాన్ని ఢిల్లీకి చెందిన రాహుల్ అరోరా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పిజ్జా తిని తాను అనారోగ్యానికి గురయ్యానని ఆరోపించారు.
శుక్రవారం సాయంత్రం పిజ్జా ఆర్డర్ చేసిన రాహుల్ ఎంచక్కా దాన్ని లాగించేశారు. అయితే స్వల్పంగా అనారోగ్యానికి గురి కావడంతో, మర్నాడు ఉదయం పిజ్జా వాళ్లు ఇచ్చిన మసాలా ప్యాకెట్‌ను విప్పి పరిశీలించాడు. ఈ ప్యాకెట్ నుండి న డామినోస్ ఒరెగానో పాకెట్‌లో పురుగులు దర్శనమివ్వడంతో షాకయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను పిజ్జా ప్రియులారా తస్మాత్ జాగ్రత్త! అంటూ సెప్టెంబర్ 10న ఫేస్‌బుక్‌లో ఈ విడియోను షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది.
మసాలా ప్యాకెట్‌లో ఉండేపురుగులు ఎక్కువ కదలకుండా ఉంటాయని, మసాలా దినుసుల్లానే కనిపిస్తూ..మోసం చేస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలు పిజ్జా తినేటపుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వ్యవహారంలో స్థానిక పిజ్జా ఔట్ లెట్ క్షమాపణ చెప్పిందని చెప్పారు. అయితే దీనిపై వినియోదారుల ఫోరానికి ఫిర్యాదు చేసినట్టు రాహుల్ పేర్కొన్నారు. ఇదే అమెరికాలో అయితే ఏం జరిగేది.. భారతీయ వినియోగదారుల పట్ల చల్తా హై ధోరణికి ముగింపు పడాలని వ్యాఖ్యానించారు.
ఘటనపై స్పందించిన డొమినోస్ పిజ్జా.. వినియోగదారులకు అందించే తమ ప్రొడక్టులు అన్ని పరిశుభ్రంగా ఉంటాయని తెలిపింది. రెస్టారెంట్ల ఇచ్చే సాచెట్‌లను పలుమార్లు పరిశీలించిన అనంతరమే పంపుతామని హామీ ఇచ్చింది.