
ప్రతీకాత్మక చిత్రం
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఓ రాజకీయ పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన చిట్టగాంగ్ జిల్లాలోని ఖగ్రాచారి పట్టణం షోనిర్బార్ బజార్ ప్రాంతంలో శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జరిగింది. వీరంతా యునైటెడ్ పీపుల్స్ డెమెక్రటిక్ ఫ్రంట్(యూపీడీఎఫ్) అనే లోకల్ పార్టీకి చెందిన వారు. మృతిచెందిన ఆరుగురిలో యూపీడీఎఫ్ నాయకుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment