వివరాలు సేకరిస్తోన్న స్థానిక ఎస్‌ఐ
కాండ్రకోట (పెద్దాపురం): జాతర వేళ.. పాత కక్షలు గుర్తొచ్చాయో.. ఏమో ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తుల మధ్య జరిగిన ఘర్ణణలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన పెద్దాపురం మండలం కాండ్రకోటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెంది న చింతాడ చక్రరావు (55) అదే గ్రామానికి చెందిన చింతపల్లి చక్రరావు, గుమ్మడి బుజ్జియ్య, గుమ్మడి గోవిందు, పిల్లి చంద్రరావులతో చక్రరావు కుమారుడు శ్రీనుల కు మధ్య జరిగిన ఘర్షణ మధ్యలోకి వెళ్లాడు.
ఆ తోపులాటలో చక్రరావు సృహతప్పి పడిపోవడంతో అతన్ని స్థానికులు పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా మా ర్గమధ్యంలో మృతి చెందాడు. దీనిపై గ్రామానికి చెందిన ఆ నలుగురు వ్యక్తులే తన తండ్రిని చంపేసారంటూ కు మారుడు శ్రీను శనివారం ఉదయం పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఎస్‌ఐ కృష్ణ భగవాన్ సం ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను విచారించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మాదిగ ఉపకులాలపై దాడులు అమానుషం
జిల్లాలో మాదిగ ఉపకులా లపై దాడులు పెరిగాయ ని, కాండ్రకోటలో జరిగిన దాడి అమానుషమని ఎంఆర్‌పీఎస్ నాయకులు వల్లూరి సత్తిబాబు అన్నారు. కాండ్రకోటలోని చక్రరావు మృతదేహం వద్దకు వచ్చి వారిపై దాడి చేసి, చావుకు కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment