Old man murder
-
మగువ ఆశ చూపి.. హత్య
కల్వకుర్తి టౌన్: మగువపై మోజు ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకునేలా చేసింది. గతేడాది నవంబర్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం సుద్దకల్ బ్రిడ్జి కింద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను సీఐ సురేందర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివసించే పత్తి రామదాసు(76) కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య గతేడాది జనవరిలో కన్నుమూసింది. అయితే, రామదాసుకు ఆడవారిపై మోజు ఉండగా వృద్ధాప్యంలో ఆలనాపాలనా, ఇంటి పనులు చూసుకునేందుకు ఓ మహిళను ఎంచుకోవాలని ఆలోచించాడు. తన ఇంట్లో వడ్రంగి పనులు చేసిన కపిలవాయి శ్రీరాములుతో మనసులో మాట చెప్పాడు. దుర్బుద్ధితో ఆలోచించిన శ్రీరాములు వద్ద నుంచి డబ్బు కొట్టేయాలని పథకం పన్నాడు. కల్వకుర్తిలో ఓ మహిళ ఉందని చెప్పాడు. అబిడ్స్‌లో ఉన్న జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రామదాసుతో రూ.2 లక్షలు డ్రా చేయించాడు. అనంతరం ఎంజీబీఎస్‌లో బస్సు ఎక్కి కల్వకుర్తికి చేరుకున్నారు. ఆటోలో నాగర్‌కర్నూల్ రోడ్డులో ఉన్న సుద్దకల్ గ్రామంలోని బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. కొద్దిసేపటి తర్వాత వెనుక నుంచి వచ్చి రామదాసు తల, ముఖంపై గట్టిగా కొట్టడంతో చనిపోయాడు. రూ.2 లక్షలు తీసుకున్న శ్రీరాములు హైదరాబాద్ వెళ్లిపోయాడు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. రామదాసు సెల్‌ఫోన్ కాల్ డేటా కోసం ఆరా తీయగా శ్రీరాములు పేరు తెరపైకి వచ్చింది. కానీ అప్పటికే శ్రీరాములు సెల్‌ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. తాజాగా శ్రీరాములు తన కూతురు వివాహ పత్రికలు పంచడానికి కల్వకుర్తికి రావటం.. సెల్‌ఫోన్ ఆన్ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. రామదాసును హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు. -
గొడవ ఆపేందుకు వెళితే..
బన్సీలాల్‌పేట్: చిన్నపాటి ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన వృద్ధుడిని తండ్రీకొడుకు కలిసి చితకబాదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కవాడిగూడ కల్పన థియేటర్ సమీపంలో కోదండరెడ్డినగర్ బస్తీకి చెందిన శివ ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులతో ఘర్షణ పడుతున్నాడు. అదే సమయంలో బయటికి వచ్చిన యాదగిరి అనే ఆటో డ్రైవర్ అక్కడి వెళ్లి ఇద్దరికి సర్ధిచెప్పి పంపించి వేశాడు. కాగా ఒకే బస్తీకి చెందిన యాదగిరి, శివ కుటుంబాల మధ్య గతంలో పార్కింగ్ విషయమై గొడవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఘర్షణలో యాదగిరి జోక్యం చేసుకోవడం సహించలేని శివ తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. శివ తండ్రి శ్రీనివాసులు, తల్లి లక్ష్మి అక్కడికి వచ్చి యాదగిరితో గొడవకు దిగారు. శివ, యాదగిరి ఛాతిలో పిడిగుద్దులు గుద్దడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందడంతో సంఘటనాస్థలానికి చేరుకున్న యాదగిరి భార్య మణెమ్మపై కూడా శివ దాడి చేసినట్లు సమాచారం. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాసులు, శివ, లక్ష్మీలపై నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ నేర్కొన్నారు. మృతుడు యాదగిరి రాణిగంజ్‌లో ఆటోట్రాలీ నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా, నిందితుడు శ్రీనివాసులు జీహెచ్ఎంసీ చెత్తబండి నడుపుతున్నాడు. గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇరువర్గాల కొట్లాటలో వృద్ధుడి మృతి
కాండ్రకోట (పెద్దాపురం): జాతర వేళ.. పాత కక్షలు గుర్తొచ్చాయో.. ఏమో ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తుల మధ్య జరిగిన ఘర్ణణలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన పెద్దాపురం మండలం కాండ్రకోటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెంది న చింతాడ చక్రరావు (55) అదే గ్రామానికి చెందిన చింతపల్లి చక్రరావు, గుమ్మడి బుజ్జియ్య, గుమ్మడి గోవిందు, పిల్లి చంద్రరావులతో చక్రరావు కుమారుడు శ్రీనుల కు మధ్య జరిగిన ఘర్షణ మధ్యలోకి వెళ్లాడు. ఆ తోపులాటలో చక్రరావు సృహతప్పి పడిపోవడంతో అతన్ని స్థానికులు పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా మా ర్గమధ్యంలో మృతి చెందాడు. దీనిపై గ్రామానికి చెందిన ఆ నలుగురు వ్యక్తులే తన తండ్రిని చంపేసారంటూ కు మారుడు శ్రీను శనివారం ఉదయం పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఎస్ఐ కృష్ణ భగవాన్ సం ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను విచారించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాదిగ ఉపకులాలపై దాడులు అమానుషం జిల్లాలో మాదిగ ఉపకులా లపై దాడులు పెరిగాయ ని, కాండ్రకోటలో జరిగిన దాడి అమానుషమని ఎంఆర్పీఎస్ నాయకులు వల్లూరి సత్తిబాబు అన్నారు. కాండ్రకోటలోని చక్రరావు మృతదేహం వద్దకు వచ్చి వారిపై దాడి చేసి, చావుకు కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులకు వివరించారు. -
మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య
గుర్రంపోడు (నాగార్జునసాగర్): మంత్రాల నెపంతో ఓ వృద్ధుడిని పట్టపగలే దారుణ హత్య చేశారు. ఘటన నల్లగొండ జిల్లా గుర్రం పోడు మండలం తెరాటిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. చేపూరు గ్రామ పంచాయతీ పరిధి తెరాటిగూడేనికి చెందిన కన్నెబోయిన రాములు(65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఏడాది క్రితం గ్రామానికి చెందిన పిల్లి సాయన్న భార్య అనారోగ్యంతో మృతిచెందగా, కుమారుడు ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాములు చేతబడి కారణంగానే వారు చనిపోయారని మృతుల కుటుంబసభ్యులు అనుమానించారు. రాములు కుమారుడు రామలింగయ్యపై గ్రామానికి చెందిన పిల్లి సాయన్న, కన్నెబోయిన శ్రీను, కన్నెబోయిన వెంకటయ్య కత్తితో దాడి చేశారు. విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. రాములు, అతడి భార్య పెద్దమ్మ, రామలింగయ్య ఘటన స్థలికి రాగా సాయ న్న, శ్రీను, వెంకటయ్యతో పాటు పలువురు వారిపై దాడికి తెగబ డ్డారు. రాములును కర్రలతో కొట్టి, గొడ్డలితో నరికి, తలపై బండరాళ్లతో మోది దారుణంగా అంతమొందించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
చేతబడి నెపంతో వృద్ధుని దారుణ హత్య
జిల్లాలోని నూతనకల్ మండలం శిల్పకుంట్ల గ్రామంలో మంగళవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్థుడు దారుణహత్యకు గురయ్యాడు. చేతబడి చేస్తున్నాడనే నెపంతో వృద్ధుని హత్యచేసినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం వృద్ధుడి మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చూరీకి తరలించినట్టు సమాచారం.