
గుర్రంపోడు (నాగార్జునసాగర్): మంత్రాల నెపంతో ఓ వృద్ధుడిని పట్టపగలే దారుణ హత్య చేశారు. ఘటన నల్లగొండ జిల్లా గుర్రం పోడు మండలం తెరాటిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. చేపూరు గ్రామ పంచాయతీ పరిధి తెరాటిగూడేనికి చెందిన కన్నెబోయిన రాములు(65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఏడాది క్రితం గ్రామానికి చెందిన పిల్లి సాయన్న భార్య అనారోగ్యంతో మృతిచెందగా, కుమారుడు ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రాములు చేతబడి కారణంగానే వారు చనిపోయారని మృతుల కుటుంబసభ్యులు అనుమానించారు. రాములు కుమారుడు రామలింగయ్యపై గ్రామానికి చెందిన పిల్లి సాయన్న, కన్నెబోయిన శ్రీను, కన్నెబోయిన వెంకటయ్య కత్తితో దాడి చేశారు. విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. రాములు, అతడి భార్య పెద్దమ్మ, రామలింగయ్య ఘటన స్థలికి రాగా సాయ న్న, శ్రీను, వెంకటయ్యతో పాటు పలువురు వారిపై దాడికి తెగబ డ్డారు. రాములును కర్రలతో కొట్టి, గొడ్డలితో నరికి, తలపై బండరాళ్లతో మోది దారుణంగా అంతమొందించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment