ఇరువర్గాలతో మాట్లాడుతున్న పోలీసులు
రెండు వర్గాల ఘర్షణ,
12 మందికి గాయాలు
బి.కొత్తకోట: బి.కొత్తకోటలో గురువారం రాత్రి గణేష్ విగ్రహ నిమజ్జనంలో చోటు చేసుకున్న ఓ చిన్న సంఘటన రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణకు దారి తీసింది. వివరాలు.. బి.కొత్తకోట స్థానిక పోకనాటి వీధిలో ప్రతిష్టించిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు స్థానికులు ఊరేగింపు ప్రారంభించారు. రాత్రి 7.30 గంటలకు ఊరేగింపు జ్యోతి చౌక్ చేరుకుంది. అక్కడ నుంచి రంగసముద్రం రోడ్డు మీదుగా వెళుతుండగా రెండు సామాజిక వర్గాల మధ్య ఓ చిన్న వివాదం ఘర్షణకు దారితీసింది. ఇది ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో ఇరు వర్గాలకు చెందిన రెడ్డిశేఖర, జానీ, మహేంద్ర, వెంకటేష్, నరేంద్ర, జనార్ధన్, శివశంకర్, సతీష్‌కుమార్, రఘ, వంశీ తదితరులతో పాటు మరొకరు గాయపడ్డారు. అయితే ఇరు వర్గాలు తమపై ఎదుటి వర్గం వారే దాడి చేశారంటూ పరస్పరం ఆరోపించుకున్నారు. సమాచారం అందుకున్న ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీయడంతో మదనపల్లె, ములకలచెరువు సీఐలు మురళి, రుషి కేశవ, ముగ్గురు ఎస్‌ఐలు బి.కొత్తకోటకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. ఈ ఘటనలో ఇటుకలు, కర్రలతో దాడులు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సంఘటన ఎలా చోటు చేసుకుంది. దీనికి బాధ్యులెవరు అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
08టీబీపీ 20160908చి220404