ముంబై: ముంబైలో శివసేన ప్రత్యర్థి వర్గాల మద్య దసరా ర్యాలీలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్ణణ జరగడానికి కొద్దిసేపటి ముందే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే.. ఉద్ధవ్ థాక్రేని లక్ష్యంగా చేసుకుని సెటైరికల్ ట్విట్లు పోస్ట్ చేశారు. ఈ మేరకు షిండే ట్విట్టర్‌లో...పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాక్రే వారసత్వంగా కొడుకులు రావాల్సిన అవసరం లేదంటూ ఉద్ధవ్ థాక్రేని ఉద్దేశిస్తూ సెటైర్లు విసిరారు.
అలాగే ప్రముఖ కవి హరివంశరాయ్ బచ్చన్ గురించి ప్రస్తావిస్తూ... నా కొడుకు కావడం వల్ల అతను నా తర్వాత వారసుడు కాలేడు, నా తదనంతరం ఎవరైతే వస్తారో వారే తన కొడుకు అవుతాడని చమత్కరించారు. అంతేగాదు నిజమైన శివసేనకు నాయకత్వం వహించనప్పుడు థాక్రే వారసత్వం గురించి ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఉద్ధవ్ థాక్రే తన తండ్రి నిలబెట్టిన పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విసయమై థాక్రే, ఏక్‌నాథ్ షిండేల మధ్య న్యాయపోరాటం జరుగుతుంది. అలాగే ఇరువురి మధ్య సంప్రదాయ దసరా ర్యాలీ విషయమై కూడా న్యాయపోరాటం చేస్తున్నారు. ఐతే ఉద్ధవ్ థాక్రేకి ఈవిషయంలో బాంబే హైకోర్టు సంప్రదాయ వేదిక శివాజీ పార్క్‌ను మంజూరు చేయడంతో కాస్త ఊరట లభించినట్లయింది.
(చదవండి: కశ్మీర్‌ను శాంతివనంగా మారుస్తాం! పాక్‌తో చర్చలపై హోం మంత్రి ఏమన్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment