చండీగఢ్: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. పోలీసుల అత్యుత్సాహం, ప్రజల అసహనం కారణంగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పంజాబ్‌లో ఎటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిరోజ్‌పూర్‌లోని సిక్రీ బజార్‌లో ఆదివారం పోలీసులు, దుకాణదారులకు మధ్య ఘర్షణ జరిగింది. లాక్‌డౌన్ నిబంధనలను అనుసరించి షాపులు మూసివేయాలన్న పోలీసులపై దుకాణదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగి గొడవ మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
కాగా, ఏప్రిల్ 12న పటియాల జిల్లాలోని ఓ కూరగాయల మార్కెట్ వద్ద జరిగిన మరో ఘటనలో ఓ వ్యక్తి ఏఎస్‌ఐ చేయి నరికేశాడు. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఎస్‌ఐని ఆస్పత్రిగా తరలించగా వైద్యులు ఏడు గంటల పాటు సర్జరీ చేసి అతడి చేతిని అతికించారు. పంజాబ్‌లో 219 మంది కరోనా బారిన పడగా, 16 మంది మృతి చెందినట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజాగా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment