- లడ్డు దక్కలేదనే అక్కసుతోనే దాడి ?
నిమజ్జనంలో ఘర్షణ.. ఒకరికి కత్తిపోటు
Published Thu, Sep 15 2016 12:09 AM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM
కేసముద్రం : కత్తి పీటతో ఒకరి తలపై మరో వ్యక్తి దాడి చేసిన సంఘటన మండల కేంద్రంలోని రేకులతండాలో బుధవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకా రం... తండాలోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులంతా కలిసి గత ఏడాది మాదిరిగానే ఈ సారి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉత్సవ కమిటీ స భ్యుల్లో లడ్డూ పాటకు పోటీ జరిగింది. ఈ పోటీలో తేజావత్ లాల్‌సింగ్ రూ.12,200కు లడ్డూను దక్కించుకున్నా డు. ఈ క్రమంలో లడ్డుకు పోటీకి దిగిన ఓ వ్యక్తి ఊరేగిం పు మొదలయ్యాక లాల్‌సింగ్‌తో గొడవకు దిగాడు. ఈ క్ర మంలో గొడవకు దిగిన వ్యక్తి ఇంట్లో ఉన్న కత్తిపీట తెచ్చి లాల్‌సింగ్ తలపై కొట్టాడు. దీంతో తలకు లోతుగా కాటుపడి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో గొడవను అడ్డుకోవడానికి వచ్చిన లచ్చు చేతికి గాయమైంది. ఈ గొడవలో లాల్‌సింగ్‌పై మరో ఇద్దరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తండావాసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిం చారు. లాల్‌సింగ్‌ను మానుకోట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తండాకు చేరుకుని విచారణ చేపట్టారు.
Advertisement
Advertisement