తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత.. కేరళలోని త్రిసూర్‌లో శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, నటుడు సురేష్ గోపి గెలుపొందిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్ధి కే మురళీధరన్ ఓటమి చెందారు.
అయితే పార్టీ ఓటమికి డీసీసీ చీఫ్ జోస్ వల్లూర్, త్రిసూర్ మాజీ ఎంపీ టీఎన్ ప్రతాపన్‌యే కారణం అంటూ జూన్ 4 తరువాత స్థానికంగా పలు పోస్టుల వెలువడ్డాయి. ప్రతాపన్, జోస్ వల్లూర్ రాజీనామా చేయాలంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ క్రమంలో తాజాగా ఓటమిపై త్రిసూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) తాజాగా సమావేశమైంది. ఈ భేటీలో పోస్టర్ల అంశంపై కార్యకర్త సురేష్‌ను వల్లూరు ప్రశ్నించడంతో వాగ్వాదం మొదలైంది.
డీసీసీ కార్యదర్శి సంజీవన్ కురియచిర, వల్లూర్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత కొందరు కార్యకర్తలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో త్రిసూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జోస్ వల్లూరుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీసీసీ కార్యదర్శి సంజీవన్ కురియచిరా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 19 మందిపై కేసు బుక్ చేశారు. వల్లూరుతో పాటు అతని మనుషులు డీసీసీ ఆఫీసులో తనపై దాడి చేసినట్లు కురియచిర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అయితే వల్లూరు వల్లే మురళీధరన్ ఓడిపోయినట్లు కురియాచిర ఆరోపించారు. కౌంటింగ్ రోజు సైతం జిల్లా, రాష్ట్ర నాయకత్వం తన ప్రచారానికి రాలేదని మురళీధరన్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment