ఇద్దరి మధ్య ఘర్షణ : ఒకరి మృతి
భీమవరం టౌ¯ŒS : ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మరణించాడు. వ¯ŒSటౌ¯ŒS సీఐ డి.వెంకటేశ్వరరావు సోమవారం కథనం ప్రకారం.. సుంకరపద్దయ్య వీధిలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో గండ్రెడ్డి శ్రీధర్(40), జెట్టి వెంకటేశ్వరరావు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో జెట్టి వెంకటేశ్వరరావు చేతితో శ్రీధర్ కుడివైపు నవరగంతపై బలంగా కొట్టాడు. దీంతో శ్రీధర్ స్పృహ కోల్పోయాడు. దీనిపై శ్రీధర్ పెదనాన్న కుమారుడు జి.మధు ఫో¯ŒS చేసి శ్రీధర్ సోదరుడు సూర్యప్రకాష్‌కు సమాచారం ఇచ్చాడు. సూర్యప్రకాష్, బంధువులు వచ్చి శ్రీధర్‌ను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తరువాత అక్కడి నుంచి సోమవారం తెల్లవారుజామున ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ చెప్పారు. సూర్యప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.