
సాక్షి, ఒంగోలు అర్బన్: ఇటీవలి ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈవీఎంల పరిశీలనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయమై శుక్రవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను విలేకర్లు అడగగా.. జరిగేది రీకౌంటింగ్ కాదని, డమ్మీ బ్యాలెట్‌లతో ఈవీఎంల పరిశీలన జరుగుతుందని చెప్పారు.
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్‌లు ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసిన వారికి చూపించనున్నట్టు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నట్లు చెప్పారు. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రోజుకు రెండు ఈవీఎంల వంతున పరిశీలించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment