ఈవీఎంల్లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేసిన బాలినేని
ఒంగోలు అర్బన్: ఈవీఎంల్లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు అందిన క్రమంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు పరిశీలించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించనున్నారు.
డమ్మీ బ్యాలెట్‌ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరగనుంది. ఈ ప్రక్రియను సీసీ కెమెరా నిఘాలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలోని 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment