ఈవీఎం మిషన్లను తనిఖీ చేస్తున్న ఎన్నికల అధికారి సుబ్బులక్ష్మి
వేలూరు: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వేలూరు లోక్‌సభ నియోజవర్గంలోని పోలింగ్ సెంటర్లకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎం మిషన్లను తరలిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్‌లోని గోడౌన్‌లో ఈవీఎం మిషన్లను భద్ర పరిచారు.
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు రావడంతో గోడౌన్‌లో సిద్ధంగా ఉంచిన ఈవీఎంలను వేలూరు జిల్లాలోని మొ త్తం ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు కలెక్టర్, ఎన్నికల అధికారి సుబ్బులక్ష్మి అధ్యక్షతన గురు వారం ఉదయం పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ తరలించారు. ఆ సమయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల ముందుగా ఈ ఈవీఎం మిషన్ల గోడౌన్‌ను పరిశీలించారు.
వేలూరు జిల్లాలోని మొత్తం 1,303 పోలింగ్ కేంద్రాలకు గాను 1,561 ఈవీఎం మిషన్‌లు, 1,561 కంట్రోల్ మిషన్‌లు, వీవీ ప్యాడ్ వంటి వాటిని తరలించారు. ఈవీఎం మిషన్లను ఆయా అసెంబ్లీ స్థానాల్లోని తాలుకా కేంద్రాల్లో ప్రత్యేక గదిలో ఉంచి, సీల్ వేయనున్నట్లు తెలిపారు. ఆ గదులకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ సమయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారుల వద్ద పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, జిల్లాలోని తహసీల్దార్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment