సేలం: లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని 'నరేంద్ర మోదీ' దక్షిణ భారతదేశంపై దృష్టి సారించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి తమిళనాడు తన మద్దతును గట్టిగా ప్రకటించిందని మోదీ మంగళవారం ప్రకటించారు.
తమిళనాడులోని సేలంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఏప్రిల్ 19న ప్రతి ఒక్క ఓటు బీజేపీ-ఎన్‌డీఏకు వేయాలని తమిళనాడు నిర్ణయించింది. తమిళనాడులో బీజేపీకి ప్రజలు ఇస్తున్న మద్దతు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ మద్దతు ప్రతిపక్ష పార్టీలకు నిద్రలేకుండా చేస్తున్నాయని అన్నారు.
#WATCH | Tamil Nadu: During his public rally in Salem, PM Modi says, "...The kind of support that the people of the country is giving to BJP & NDA has resulted in sleepless nights of the DMK..." pic.twitter.com/jawRdxMoe5
— ANI (@ANI) March 19, 2024
రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు దివంగత కేఎన్ లక్ష్మణన్.. రాష్ట్రంలో బీజేపీ విస్తరణకు ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నప్పుడు ప్రధాని ఉద్వేగానికి లోనయ్యారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆడిటర్ 'వీ. రమేష్'ను గుర్తు చేసుకున్నారు. పీఎంకేతో సీట్ల పంపకాల ఒప్పందం తరువాత ఎన్‌డీఏకు కొత్త శక్తి వచ్చిందని మోదీ అన్నారు.
#WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi gets emotional as he remembers Former State BJP president late K.N. Lakshmanan & his contribution towards the expansion of BJP in the state. pic.twitter.com/7ZN4m3MbQx
— ANI (@ANI) March 19, 2024
ఏప్రిల్ 19న జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం తమిళనాడులోని డాక్టర్ ఎస్ రామదాస్ నేతృత్వంలోని పీఎంకేతో అంతకుముందు రోజు బీజేపీ సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రాంతీయ పార్టీకి 10 కేటాయించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై, పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్‌లు తైలాపురంలోని ఆయన నివాసంలో ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా ఈ ఒప్పందం అధికారికంగా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment