అయోధ్యకు మోదీ.. ముస్తాబవుతున్న నగరం | PM Modi Ayodhya Roadshow Details | Sakshi
Sakshi News home page

అయోధ్యకు మోదీ.. ముస్తాబవుతున్న నగరం

Published Sun, May 5 2024 11:21 AM | Last Updated on Sun, May 5 2024 11:22 AM

PM Modi Ayodhya Roadshow Details

లక్నో: జార్ఖండ్, బీహార్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ.. ఉత్తరప్రదేశ్‌లోని ధౌరాహ్రా, అయోధ్యలో ఆదివారం ప్రచార కార్యక్రమాలను తలపెట్టారు. ఇప్పటికే మోదీ రాక కోసం నగర వీధులు బీజేపీ జెండాలతో ముస్తాబవుతున్నాయి.

నరేంద్ర మోదీ మధ్యాహ్నం 2.45 గంటలకు ఇటావాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4.45 గంటలకు ధౌరాహ్రాలో మరో సభ నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు అయోధ్యలోని రామమందిరంలో ప్రార్థనలు, పూజలు చేస్తారు.

ప్రధాని మోదీ రోడ్‌షో సుగ్రీవ కోట నుంచి ప్రారంభమై లతా చౌక్ వరకు కొనసాగుతుంది. రోడ్‌షో జరిగే మార్గాన్ని 40 బ్లాక్‌లుగా విభజించారు. ఈ కార్యక్రమంలో సింధీలు, పంజాబీలు, రైతులు, మహిళలు పాల్గొంటారు. బాలరాముని ప్రాణప్రతిష్ట తరువాత మోదీ అయోధ్యను సందర్శించడం ఇదే మొదటిసారి.

ప్రధాని మోదీ పర్యటనకు ముందు, రామాలయం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అయోధ్యలో రామ్ లల్లా దర్శనం, రోడ్‌షో కోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. అయోధ్యలో మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఐదవ దశలో (మే 20) అయోధ్యలో ఓటింగ్ జరగనుంది. జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతాయి. అన్ని స్థానాల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. దేశంలో ఎక్కువ ఎంపీ స్థానాలున్న (80 సీట్లు) రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో గత ఎన్నికల్లో 62 స్థానాల్లో బీజేపీ పతాకం ఎగురవేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement