ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి | Sakshi
Sakshi News home page

ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి

Published Tue, May 7 2024 2:43 PM

Think About the Future Modi Saying Neither Against Muslims

ఢిల్లీ: భారతదేశంలో రాజకీయ వేడి రోజురోజుకి పెరుగుతోంది. ఏప్రిల్ 22న రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ చేసిన 'చొరబాటుదారుల' వ్యాఖ్యపై.. ఇటు బీజేపీ, అటు ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎట్టకేలకు దీనిపైన ప్రధాని ఓ స్పష్టమైన వివరణ ఇచ్చారు.

తాను ముస్లింలకు లేదా ఇస్లాంకు వ్యతిరేకం కాదని, ఆత్మపరిశీలన చేసుకోవాలని, భవిష్యత్తు గురించి ఆలోచించాలని ముస్లిం సమాజాన్ని ప్రధాని మోదీ కోరారు. దీనికి సంబంధించిన వీడియోను మోదీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.

ఈ వీడియోలో.. మేము ముస్లిం లేదా ఇస్లాంకు వ్యతిరేకం కాదు. అది మా పని కాదు. ముస్లిం సమాజం ప్రతిదీ అర్థం చేసుకుంటుంది. ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని ముగించినప్పుడు, ఆయుష్మాన్ కార్డు ఇచ్చినప్పుడు లేదా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు, ముస్లిం సోదరీమణులు మమ్మల్ని నిజమైన మనుషులుగా భావించారు. మేము ఎవరిమీదా వివక్ష చూపమని మోదీ స్పష్టం చేశారు.

ముస్లిం సమాజం, వారి విద్యావంతులైన సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాలని మోదీ కోరారు. దేశం ముందుకు సాగుతోంది. మీ సంఘం వెనుకబడి ఉంటే, దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందారా? అని మోదీ అన్నారు. ఎవరిని అధికారంలో పెట్టాలి, ఎవరిని తొలగించాలి అని ఆలోచిస్తూ..  మీరు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం మారుతోంది. మీరు కూడా మారాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.

భవిష్యత్తు గురించి ఆలోచించు. భయాందోళనతో కూడిన వాతావరణంలో ఏ సమాజమూ బానిస జీవితాన్ని గడపాలని నేను కోరుకోవడం లేదుని ముస్లిం సమాజాన్ని ప్రధాని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని, దానిని అగౌరవపరిచే వారికి ఏమీ మాట్లాడే హక్కు లేదని ఆరోపించారు.

Advertisement
Advertisement