ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన 'తమిళిసై సౌందరరాజన్' (Tamilisai Soundararajan) బీజేపీలో చేరారు. చెన్నైలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, అన్నామలై, ఎల్.మురుగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆమెకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సభ్యత్వ కార్డును కూడా అందజేశారు.
నేడు (మార్చి 21) బీజేపీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన 9 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం సాయంత్రం అధికారికంగా విడుదల చేసింది. ఇందులో చెన్నై సౌత్ నుంచి మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు.
వెల్లూరు నుంచి డాక్టర్ ఏసీ షణ్ముఘం, కృష్ణగిరి నుంచి సీ నరసింహ, నీలగిరి నుంచి డాక్టర్ ఎల్ మురుగన్, కోయంబత్తూరు నుంచి అన్నామలై, పెరంబలూరు నుంచి టీఆర్ పర్వేంధర్, తూత్తుకుడి నుంచి నైనార్ నాగేంద్రన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment