ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్
షోలాపూర్: అమెరికా, ఇంగ్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మన దగ్గర మాత్రం ఈవీఎంలు ఎందుకని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ ప్రశ్నించారు. ఈవీఎంలను పక్కనపెట్టి కేవలం బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఈవీఎంల కారణంగా ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్రలో నాసిక్ జిల్లా మర్కద్‌వాడీ గ్రామంలో బ్యాలెట్ పేపర్లతో రీపోలింగ్ జరపాలని పోరాడుతున్న ప్రజలను శరద్ ఆదివారం కలుసుకున్నారు. వారికి సంఘీభావం ప్రకటించారు. మర్కద్‌వాదీ గ్రామస్థులు గొప్ప ఉద్యమం ప్రారంభించారని, మొత్తం దేశానికే సరైన దశాదిశ చూపుతున్నారని శరద్ పవార్ ప్రశంసించారు. గ్రామస్థులపై పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు తనకు ఇవ్వాలని, ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రధానమంత్రి, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని శరద్ పవార్ పేర్కొన్నారు.
మమతా బెనర్జీ సమర్థ నేత
విపక్ష ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీని అప్పగించాలన్న ప్రతిపాదనకు శరద్ పవార్‡మద్దతు పలికారు. ఆమె సమర్థత కలిగిన నాయకురాలు అని చెప్పారు. ఇండియా కూటమిని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నానని మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: రైతులపై టియర్‌గ్యాస్.. ‘ఢిల్లీ చలో’లో హైటెన్షన్
Comments
Please login to add a commentAdd a comment