పుణె: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోవర్గంలో మంగళవారం పోలింగ్ జరిగింది. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్‌సీపీ నాయకురాలు, మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ ఈవీఎం పూజలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సింహగఢ్ రోడ్, పుణె సిటీ పోలీస్‌స్టేషన్‌లలో ఆమెపై కేసు నమోదైంది.
ఓటింగ్ సందర్భంగా ఖడక్వాస్లా ప్రాంతంలోని పోలింగ్ కేంద్రానికి రూపాలి చకంకర్ ప్లేటు, దీపంతో వచ్చారు. ఈవీఎం మెషిన్ వద్ద పూజలు చేశారు. స్థానికి ఎన్నికల అధికారులు ఉన్నతాధికారలకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెపై సింహగఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్‌కు మహాయుతి కూటమి బారామతి లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచి ఆమె కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్న రూపాలి చకంకర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment