బీజింగ్: రైలు ప్రమాదానికి గురైందని, తొమ్మిది మంది చనిపోయారని తప్పుడు వార్తను చాట్‌జీపీటీలో సృష్టించి, ప్రచారంలోకి తీసుకొచ్చిన వ్యక్తిని చైనా పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. చైనాలో చాట్‌జీపీటీ దుర్వినియోగం కారణంగా జరిగిన తొలి అరెస్టు ఇదేనని పోలీసులు చెబుతున్నారు.
వాయవ్య గాన్సు ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. నిందితుడు హాంగ్ అనే మారుపేరుతో చెలామణి అవుతున్నట్లు గుర్తించారు. అతడు సృష్టించిన తప్పుడు వార్త నిజమని భ్రమించి, కొన్ని పత్రికలు ప్రచురించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment