పల్స్‌పోలియో నిధుల దుర్వినియోగంపై నేడు విచారణ
Published Tue, Jul 18 2017 12:21 AM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM
కాకినాడ వైద్యం :
పల్స్ పోలియో నిధుల దుర్వినియోగంపై విజయవాడ వైద్య ఆరోగ్య కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనరేట్ జాయింట్ డైరెక్టర్, చైల్డ్ హెల్త్ ఇమ్యూనైజేషన్ అధికారి ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడలో విచారణ చేపట్టనున్నారు. 2014–15లో పల్స్‌పోలియో కార్యక్రమం కోసం వచ్చిన కంటింజెన్సీ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై మంగళ, బుధవారాల్లో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో విచారణ చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. విచారణలో డీఎంహెచ్‌ఓ కార్యాలయ ఉద్యోగులందరూ పాల్గొనాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.చంద్రయ్యకి ఆదేశించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఉద్యోగులందరూ ఇద్దరు డీఎంహెచ్‌ఓలు, అదనపు డీఎంహెచ్‌ఓ, ఇద్దరు జిల్లా ఇమ్యునైజేషన్ అ««ధికారులు, పల్స్‌పోలియోకు బిల్లుల తయారీకి ప్రింటర్ యజమానులు కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు.
Advertisement