ఆంధ్రప్రదేశ్లోనూ సీబీఐని ఉసిగొల్పారు: మోడీ | centre misuses CBI in Andhra pradesh, says Narendra Modi | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్లోనూ సీబీఐని ఉసిగొల్పారు: మోడీ

Published Tue, Apr 22 2014 9:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఆంధ్రప్రదేశ్లోనూ సీబీఐని ఉసిగొల్పారు: మోడీ - Sakshi

ఆంధ్రప్రదేశ్లోనూ సీబీఐని ఉసిగొల్పారు: మోడీ

హైదరాబాద్: యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనూ సీబీఐని దుర్వినియోగం చేసిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ.. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాజకీయ కారణాల వల్లే  కేంద్రం సీబీఐని ఉసిగొల్పిందని మోడీ ఆరోపించారు. నిజామాబాద్ సభలో మోడీతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, మహబూబ్ నగర్ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ సభలో వీరు ముగ్గురు కలసి పాల్గొన్నారు.

ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు సమర్థ ప్రభుత్వానికే అధికారం ఇవ్వాలని మోడీ కోరారు. ఢిల్లీలో తల్లీకొడుకుల ప్రాణ వాయువుతో నడిచే ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని విజ్ఙప్తి చేశారు. రెండు రాష్ట్రాలకు ఉజ్వల భవిష్యత్ రావాలని మోడీ ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. టీఆర్ఎస్తో కుటుంబ పాలన తప్ప తెలంగాణకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ నోటిదురుసు వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. తెలంగాణను ఎంత సమర్థవంతంగా అభివృద్ధి చేసుకోవాలన్నది సమస్యని, ఎవరిని గెలిపిస్తో అభివృద్ధి జరుగుతుందో ఆలోచించాలని ప్రజలను కోరారు. మోడీ అధికారంలోకి వస్తే యువత భవితకు భరోసా ఉంటుందని, అందుకే మద్దతు ప్రకటించానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement