'సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారు' | centre misuses CBI, says mamata benarjee | Sakshi
Sakshi News home page

'సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారు'

Published Mon, Nov 24 2014 5:05 PM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

'సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారు'

'సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారు'

కేంద్రంలో అధికారంలో ఉన్నవారు సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని తృణమాల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.

కోల్కతా: కేంద్రంలో అధికారంలో ఉన్నవారు సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని తృణమాల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఒకరిద్దరు బయటవాళ్లు చేసిన తప్పుకు మొత్తం పార్టీపైనే నిందలు మోపుతున్నారని అన్నారు.

బంగ్లాదేశీయులు తమ పొరుగువారని, సోదరులని మమతా బెనర్జీ పేర్కొన్నారు. తీవ్రవాదులకు దేశం, మతం ఉండదని, వారిని తీవ్రవాదులుగానే చూడాలని అన్నారు. బెంగాల్ శారద స్కాంలో తృణమాల్ ఎంపీలను సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన పేలుళ్లకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ పలువురు నిందితులను అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మమత పైవిధంగా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement