ఎవరీ జిమ్మీ కిమ్మెల్?.. ట్రంప్‌కు కోపం ఎందుకొచ్చింది? | Jimmy Kimmel Live Show Taken Off Air Over Charlie Kirk Murder Remarks, More Details Inside | Sakshi
Sakshi News home page

ఎవరీ జిమ్మీ కిమ్మెల్?.. ట్రంప్‌కు కోపం ఎందుకొచ్చింది?

Sep 18 2025 9:55 AM | Updated on Sep 18 2025 11:46 AM

Jimmy Kimmel Live Show Charlie kirk Murder Remarks

ప్రముఖ మీడియా సంస్థ ఏబీసీ తన లేట్-నైట్ టాక్ షో ‘జిమ్మీ కిమ్మెల్ లైవ్’ను నిరవధికంగా నిలిపివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహితుడు, కన్జర్వేటివ్‌ పార్టీ యాక్టివిస్ట్‌ చార్లీ కిర్క్‌పై వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ (Jimmy Kimmel)  సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ)డైరెక్టర్ కాష్ పటేల్‌లు ఈ హత్యపై దర్యాప్తులో నిర్వహించిన తీరుపై జిమ్మీ కిమ్మెల్ విమర్శలు గుప్పించారు. 

కాగా జిమ్మీ లేట్ నైట్ షోను రద్దు చేయాలన్న ఏబీసీ నిర్ణయంపై అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికాకు ఇది గొప్ప వార్త అని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10న ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో తుపాకీ కాల్పులకు బలయ్యాడు. అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో చార్లీ కిర్క్ మరణాన్ని అధికారికంగా ప్రకటించారు. అతనిని ఈవెన్ లెజెండరీ అంటూ ప్రశంసించారు. 

కాగా సోమవారం కిమ్మెల్ తన ప్రముఖ లేట్ నైట్ షో లో మోనోలాగ్‌లో జరిగిన కాల్పుల గురించి మాట్లాడారు. చార్లీ కిర్క్‌ను హత్య చేసిన  టైలర్ రాబిన్సన్ ను వలసవాదిగా చిత్రీకరించేందుకు మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (మెగా) గ్యాంగ్ తీవ్రంగా ప్రయత్నించిందని, తద్వారా రాజకీయ లబ్ధకోసం తాపత్రయపడిందని కిమ్మెల్ ఆరోపించారు.
 

ట్రంప్‌కు అందుకే కోపం..
అధ్యక్షుడు ట్రంప్ తన స్నేహితుడు చార్లీని కోల్పోయినందుకు ఎలా బాధపడ్డారనేదానిపై కిమ్మెల్ వ్యంగ్యంగా మాట్లాడారు. ట్రంప్‌ దుఃఖించే విధానాన్ని ఎగతాళి చేస్తూ ఆయన దుఃఖంలో నాల్గవ దశలో ఉన్నారన్నారు. తన స్నేహితుని హత్యపై అతను బాధపడటం లేదని, నాలుగేళ్ల పిల్లవాడు గోల్డ్ ఫిష్‌ పోతే ఎలా  బాధపడతాడో అలా దుఃఖించారని కిమ్మెల్ వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్ షోలో ట్రంప్.. కిర్క్ మరణంపై మాట్లాడిన  క్లిప్పింగ్‌ను కిమ్మెల్ ప్లే చేశారు.ఈ షోలో ట్రంప్‌ వైట్ హౌస్‌లో  అత్యంత ఖరీదైన బాల్‌రూమ్‌ను నిర్మించడంలోని ఉద్దేశ్యాన్ని కూడా ప్రశ్నించారు.

అయితే ఇంతలో నెక్స్‌స్టార్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రెసిడెంట్ ఆండ్రూ ఆల్ఫోర్డ్ ఒక ప్రకటనలో కిమ్మెల్ వ్యాఖ్యలను కంపెనీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, కిర్క్ మరణంపై కిమ్మెల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి తాము భావిస్తున్నామన్నామని ప్రకటించారు.  కిమ్మెల్‌కు ప్రసార వేదికను అందించడం ప్రస్తుత సమయంలో ప్రజా ప్రయోజనం కోసం కాదని భావిస్తూ,  జిమ్మీ షో ప్రసారం నిరవధికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించారు. కాగా జిమ్మీ కిమ్మెల్ లేట్-నైట్ షో రద్దును అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. ఇందుకు ధైర్యం చూపినందుకు ఏబీసీని అభినందించారు.

జిమ్మీ కిమ్మెల్ ఒక ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్, హాస్యనటుడు.. ప్రొడ్యూసర్ కూడా. ఆయన "Jimmy Kimmel Live!" అనే లేట్ నైట్ టాక్ షోను 2003 నుండి ABC ఛానల్‌లో హోస్ట్ చేస్తున్నారు. రాజకీయ వ్యంగ్యం.. సెలబ్రిటీలతో చేసే చమత్కార సంభాషణలతో టీవీ రంగంలో ఎంతో ప్రసిద్ధి పొందారీయ. తాజాగా చార్లీ కిర్క్‌ హత్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఆపై షో నిలిచిపోవడం.. అమెరికాలో భావ స్వేచ్ఛ ప్రకటపై చర్చకు దారితీసింది. అయితే వ్యంగ్యంగా రాజకీయ విమర్శలు గుప్పించే జిమ్మి కిమ్మెల్‌తో పాటు జిమ్మీ ఫాలోన్‌, సెత్‌ మేయర్స్‌లాంటి హోస్టులనూ కూడా ట్రంప్‌ ఇంతకు ముందు తిట్టిపోశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement