శివసేనకు రూ.85కోట్లు ఇచ్చిన వీడియోకాన్ | Videocon gave Shiv Sena Rs 85 crore in 2015-16 | Sakshi
Sakshi News home page

శివసేనకు రూ.85కోట్లు ఇచ్చిన వీడియోకాన్

Published Sat, Nov 19 2016 1:48 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

శివసేనకు రూ.85కోట్లు ఇచ్చిన వీడియోకాన్ - Sakshi

శివసేనకు రూ.85కోట్లు ఇచ్చిన వీడియోకాన్

ముంబయి: ప్రముఖ వ్యాపార సంస్థ వీడియోకాన్ మహారాష్ట్రలోని శివసేన పార్టీకి రూ.85కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో శివసేన పేర్కొంది. దీని ప్రకారం శివసేనకు పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చే సంస్థగా వీడియోకాన్ ఉండటం కూడా గమనార్హం. 2015-16 సంవత్సరానికిగాను, కార్పొరేట్ సంస్థలు, కార్పొరేటరేతర సంస్థల నుంచి మొత్తం రూ.86.84కోట్ల మొత్తం విరాళ రూపంలో వచ్చిందని పేర్కొనగా అందులో రూ.85కోట్లు వీడియోకాన్ ఇచ్చిందట.

ఇక ఇదే సంస్థ శరద్ పవార్ కు చెందిన నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రూ.25లక్షలు మాత్రమే విరాళంగా ఇచ్చింది. ఆదాయ పన్నుకు సంబంధించిన 139వ సెక్షన్ ప్రకారం 2016, సెప్టెంబర్ 27న శివసేన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్ ఈ వివరాలు ఎన్నికల కమిషన్కు సమర్పించారు. ఈ వివరాలు కమిషన్ వెబ్ సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ కూడా ఈ వివరాలు అందించగా బీజేపీ మాత్రం ఇంకా సమర్పించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement