బాలీవుడ్ నటి, రంగీలా ఫేమ్ ఊర్మిళ మతోంద్కర్ మహారాష్ష్ర్ట సీఎం, పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే నివాసంలో మంగళవారం మధ్యాహ్నం శివసేన పార్టీలో చేరారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాక గవర్నర్ కోటా నుంచి ఆ పార్టీ తరపున ఆమె మహారాష్ష్ర్ట శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. రాష్ష్ర్ట పాలక మహావికాస్ అగాది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల కూటమి ఇప్పటికే 11 మంది పేర్లతోపాటూ ఆమె పేరును కూడా మహారాష్ష్ర్ట గవర్నర్ కోశ్యారీకి పంపడం జరిగింది. అయితే కేబినేట్ సిపారసు మేరకు మహారాష్ట్ర శాసన ఎగువ సభకు 12 మంది సభ్యుల జాబితాకు గవర్నర్ కోశ్యారీ ఆమోదం తెలపాల్సి ఉంది. (చదవండి: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే నిర్వాకం)
46 సంవత్సరాల ఊర్మిళ మతోంద్కర్ గత మార్చిలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల్లో ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సెప్టెంబర్‌లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అంతర్గత రాజకీయాలతో ఆమె పార్టీని వీడారు. ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిన కంగన రనౌత్ నెపోటిజంపై కూడా ఊర్మిళ స్పందించారు. బాలీవుడ్‌లో కొందరు డ్రగ్స్ యూస్ చేసినంత మాత్రానా డ్రగ్ మాఫియా అనడం కరెక్ట్ కాదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన విషయాల్లో కూడా సోషల్ మీడియా వేదికగా ఊర్మిళ తన స్వరం వినిపించింది.
Comments
Please login to add a commentAdd a comment